కనబడకుండా పోయిన విద్యాశాఖ మంత్రి పట్టించిన వాళ్ళకి బహుమానం..
నేటి సత్యం శేరిలింగంపల్లి జనవరి 7 అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) శేర్లింగంపల్లి మండలం మసీద్ బండ కొండాపూర్ లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 15 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్న (జి హెచ్ ఎం) గెజిటెడ్ హెడ్ మాస్టర్ పోస్ట్ ని వెంటనే నియమించాలి, రోజురోజుకీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం విప్లమవుతుంది విద్యార్థులు 20 నుంచి 30% మాత్రమే భోజనం తింటున్నారు మిళిత విద్యార్థులు ఇంటి భోజనం తెచ్చుకుంటున్నారు , క్లాస్ రూమ్ లో కొత్త లైట్స్, ఫాన్స్ పెట్టాలి అలాగే టాయిలెట్స్ ని ఎప్పుడు అప్పుడే శుభ్రంగా ఉంచాలి 24 గంటలు నీళ్లు వదలాలి, స్కూల్ ముందు ఒక వాచ్మెన్ ని పెట్టాలి లేకపోతే విద్యార్థులు బయటికి వెళ్లి రావడం జరుగుతుంది….
ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ కు మంత్రిని నియమించాలి
విద్యార్థులకు న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదు (ఏఐఎస్ఎఫ్) శేర్లింగంపల్లి మండల్ అధ్యక్షుడు టీ.నితీష్ కార్యదర్శి జె. ధర్మతేజ