*సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు బాతరాజు నరసింహ ఆధ్వర్యంలో జీపు జాత*
నేటి సత్యంఎల్బీనగర్ నియోజకవర్గం ప్రతినిధి సక్రు నాయక్:.
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సరూర్నగర్ మండల కార్యదర్శి బాతరాజు నరసింహ ఆధ్వర్యంలో సరూర్ నగర్ మండల కేంద్రం భగత్ సింగ్ నగర్ లో ప్రచార జీపు జాత ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి జాతీయ సమితి సభ్యులు పాలమాకుల జంగయ్య గారు జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. అనంతరం జంగయ్య మాట్లాడుతూ వంద సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్నా లేకున్నా ఎంతోమంది పేద ప్రజల కోసం ఇంటి స్థలాలను పోరాటాల ద్వారా పేదలకు పంచిన చరిత్ర కమ్యూనిస్టులదని అలాంటి పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 5 లక్షల మందితో ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభ కు మండలం నుండి భారీ ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు రామస్వామి, సిపిఐ మాజీ సర్పంచ్ ఆర్ గోపాల్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గ్యార క్రాంతి కుమార్, జిల్లా సమితి సభ్యులు జిల్లాల కృష్ణ సక్రు నాయక్ కమలమ్మ మహబూబ్ , ఎండి ఇస్మాయిల్ ,Aisf మండల కార్యదర్శి వినోద్ , ఎల్లమ్మ విజయ ,హిజ్రీచ్, జాహెద్ స్థానికులు తదితరులు పాల్గొన్నారు.