Neti Satyam
Newspaper Banner
Date of Publish : 09 January 2026, 12:21 pm Editor : Admin

సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలి ఎన్. జ్యోతి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

*సంస్కృతి సంప్రదాయాలను కాపాడాకోవాలి.*

*మహిళ సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి ఎన్ జ్యోతి.*

నేటి సత్యం జగదిరిగుట్ట జనవరి 9

భారత జాతీయ మహిళా సమాఖ్య నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో నేడు జగద్గిరిగుట్ట సిపిఐ కార్యాలయంలో ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షులు హైమావతి వహించగా ముఖ్య అతిథులుగా భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి నిదునూరి జ్యోతి, సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ పాల్గొని జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీలను నిర్వహించడం అభినందనీయమని,ఇలాంటి కార్యక్రమాల ద్వారా మన సంస్కృతి,సంప్రదాయాలను కాపాడుకోని భవిష్యత్తు తరాలకు అందించవచ్చని అన్నారు. మహిళలు కూడా కేవలం ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రానిస్తున్నారని దాని కోసం ఇక్కడ కూడా మహిళలు ఐక్యం కావాలని బూర్జవా లక్షణాలను తొలగించి మన సంప్రదాయలను కాపాడుకోవడానికి అవినీతి,మద్యం లాంటి ఆవలక్షణాలను తొలగించడానికి ప్రయత్నం చెయ్యాలని కోరారు.

ఈ సందర్బంగా మొత్తం 53 మంది పాల్గొనగ మొదటి బహుమతి సరితకు రెండవ,మూడవ బహుమతి లను ఇవ్వగ ప్రతి ఒక్కరికి బహుమానలను ఇవ్వడం జరిగింది.

*ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి లక్ష్మి,జిల్లా ఉపాధ్యక్షులు గిరిజ,మాధవి,ప్రజానాట్యమండలి కార్యదర్శి ప్రమీల,సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఏసురత్నం,సహాయ కార్యదర్శి హరినాథ్ రావ్,రాములు,సిపిఐ సీనియర్ నాయకులు వెంకటేష్,దుర్గయ్య,నాయకులు నర్సింహారెడ్డి,సహదేవరెడ్డి,చంద్రకాంత్,ఇమామ్,నర్సింహా,మల్ల రెడ్డి,పవన్,వంశీ తదితరులు పాల్గొన్నారు.*