Neti Satyam
Newspaper Banner
Date of Publish : 10 January 2026, 2:07 pm Editor : Admin

కొందుర్గు ప్రీమియర్ లీగ్ సీజన్ 6 క్రికెట్ టోర్నమెంట్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

*కొందుర్గు ప్రీమియర్ లీగ్ సీజన్ 6 క్రికెట్ టోర్నమెంట్*

క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి గారు* షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండల పరిధిలోని ఆధ్వర్యంలో నిర్వహించిన కొందుర్గు ప్రీమియర్ లీగ్ సీజన్ 6 క్రికెట్ టోర్నమెంట్ ముఖ్యఅతిథిగా పాల్గొని రిబ్బేన కట్ చేసి టోర్నమెంట్ ను ప్రారంభించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి గారు.. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గార్లను శాలువతో బొకేతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపిన మండల నాయకులు, క్రీడాకారులు.. అనంతరం మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతూ యువత కృషి పట్టుదలతో కష్టపడి క్రీడల్లో రాణిస్తే బంగారు భవిష్యత్తు లభిస్తుందని అన్నారు, క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాదు, అవి ఆరోగ్యకరమైన జీవితానికి, విజయవంతమైన భవిష్యత్తుకు పునాది వేస్తాయని అన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ చదువుతోపాటు అన్ని రంగాల్లో నైపుణ్యం సాధించాలని సూచించారు. క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం, క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి వంటివి సాధించవచ్చని, ఇవి జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి దోహదపడతాయని అన్నారు. అంతేకాకుండా జిల్లా స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో పాల్గొనాలని తెలిపారు, యువతకు తన పూర్తిసహకరం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు ఈ టోర్నమెంట్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో కొందుర్గు సర్పంచ్ ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణారెడ్డి, దామోదర్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, రమేష్ గౌడ్, కేకే కృష్ణ, మాజీ సర్పంచ్ యద్దయ్య మరియు ఆయా గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు మరియు కొందుర్గు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల యువకులు, క్రీడాకారులు పెద్దఎత్తున పాల్గొన్నారు..