(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం శేరిలింగంపల్లి జనవరి 12
కన్నుల పండువగా సంక్రాంతి మెగా ముగ్గుల పోటీలు… పాల్గొన్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ గారు.
సంక్రాంతి సంబరాలలో భాగంగా గౌరవ శేరిలింగంపల్లి కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో రాజీవ్ గృహకల్పలోని జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ప్రియతమ నాయకులు శేరిలింగంపల్లి కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ గారు, రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుధ్ యాదవ్ గారు, రాగం జాగృతి యాదవ్ గారు విచ్చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు చుట్టుపక్కన ప్రాంత మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎంతో ఉత్సాహంతో రంగురంగుల ముగ్గులు వేసి సంక్రాంతి పండుగ వైభవాన్ని మరింత పెంచారు.
ఈ సందర్భంగా ఆకర్షణీయంగా ముగ్గులు వేసిన మొదటి ముగ్గురు విజేతలు కృష్ణవేణి, మాధురి, పరమేశ్వరి లను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారి తరఫున నగదు బహుమతులు అందజేయడం జరిగింది. అలాగే పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు కన్సలేషన్ బహుమతులు ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు మాట్లాడుతూ… సంక్రాంతి సంబరాలను ప్రజలతో కలిసి ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ ముగ్గుల పోటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ముగ్గులు మన సంస్కృతికి మరియు కళాత్మకతకు ప్రతిరూపాలు ఇంటి ముందు ముగ్గు వేయడం లక్ష్మీదేవికి ఆహ్వానం పలకడమేనని మన నమ్మకం అని అన్నారు.
మహిళలు తమలోని నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ముగ్గుల పోటీలు ఒక గొప్ప వేదిక చుక్కల ముగ్గులు గీత ముగ్గులు మరియు రంగురంగుల రంగవల్లులతో నేలంతా కళాఖండంగా మారుతుందన్నారు.
కాలనీ వాసులందరూ కలిసి ఈ పోటీలలో పాల్గొనడం వల్ల సామాజిక సంబంధాలు బలపడతాయని అన్నారు.
సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి మహిళకు, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులకు, కాలనీవాసులకు పోటీ నిర్వాహకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, వార్డు మెంబర్ శ్రీకళ వెంకటేశ్వర్లు, శారదా విద్యానికేతన్ ప్రిన్సిపల్ రోజీ, జడ్జెస్ తరుణం, సురేఖ, జబర్దస్త్ టీం వినోద్, సందయ్య నగర్ కాలనీ ప్రెసిడెంట్ బస్వరాజ్, మోహన్, సోనీ, శ్రేయ, తన్వి, స్వప్న మహిళా నాయకురాళ్లు చంద్రకళ, భాగ్యలక్ష్మి, కుమారి, జయ, సుధారాణి, జయమ్మ, లక్ష్మి, రోజరాణి, కళ్యాణి, రాములమ్మ, ఫాతిమ, గౌసియా, దేవి, కమల, సబియా, స్వాతి, చారీ, ఎల్లేష్, కుమార్ స్థానికవాసులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.