(adsbygoogle = window.adsbygoogle || []).push({});
పేద ప్రజలకు వైద్యం సేవలు వందశాతం ప్రభుత్వ ఆసుపత్రులలోనే అందించాలి.
వైద్యంతోపాటు పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండాలి.
త్వరలో మెడికల్ కళాశాల వద్ద 550 పడకల ఆసుపత్రి పనులు ప్రారంభం.
నాగర్ కర్నూలు శాసనసభ్యులు కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి.
తెలకపల్లి/ నాగర్ కర్నూలు జిల్లా/నేటి సత్యం జనవరి 12.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో సోమవారం నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పారిశుద్ధ్య కార్మికులకు నిర్వహించిన ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా పలు వార్డులలో పారిశుద్ధ్య సేవలను పరిశీలించారు. ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు. ఆస్పత్రి ఆవరణ చుట్టు శుభ్రత ఉంచుతూ నియోజకవర్గ ప్రజలకు ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు వైద్యంతో పాటు పారిశుధ్యం వంద శాతం శుభ్రత ఉండే విధంగా చూడాల్సిన బాధ్యత కార్మికులపై ఉందని ఆయన సూచించారు. ఈ నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి వైద్య ఆరోగ్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రులలోనే అందించే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్యులను కోరారు.ప్రభుత్వ ఆసుపత్రుల నెట్ వర్క్ సేవలను వైద్యులు మెరుగ్గాఉపయోగించుకొని ఈ ప్రాంత ప్రజలకు ఆరోగ్య సేవలు అధిక మొత్తంలో అందించాలని సూచించారు.ఒకవైపు ఆరోగ్యం మరొకవైపు పారిశుధ్యం,శుభ్రత పాటింపులో నిర్లక్ష్యం వహించరాదనిసూచించారు.
త్వరలో మెడికల్ కళాశాల వద్ద 550 పడకల ఆసుపత్రి పనులు ప్రారంభం చేస్తామని అన్నారు.డిప్యూటీ మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ వి.శేఖర్ పారిశుద్ధ్య కార్మికులకు నిర్వహించిన ముగ్గుల పోటీలలో విజేతలకు ప్రథమ స్థాయిలో నిలిచిన వారికి 8వేల నగదు,ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి 6వేల నగదు మూడో స్థానంలో నిలిచిన వారికి 4వేల స్థానంలో నిలిచిన వారికి 2వేల నగదు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రమణారావు మాజీ కౌన్సిలర్లు కొత్త శ్రీనివాసులు, జక్కరాజ్ కుమార్ డిప్యూటీ మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ వి.శేఖర్,రేసిడెంట్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ రవిశంకర్,డాక్టర్ హనుమంతరావు,డాక్టర్ రోహిత్, డాక్టర్ అజీమ్, డాక్టర్ సూర్యనారాయణ,డాక్టర్ కోటేశ్వర్ ,నర్సింగ్ సూపర్డెంట్ మంజుల హెడ్ నర్సులు పద్మ,నర్సింగ్ అధికారి ఎం.ఆనంద్,రూపా,రాణి, జానకి దేవి, జ్ఞానేశ్వరి, హెల్ప్ డెస్క్ ఇంచార్జ్ యాదగిరి, ఆసుపత్రి వైద్యులు, సానిటరీ పర్యవేక్షకులు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.