(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పర్వదినాలతో మూడు రోజులపాటు సంక్రాంతి వైభవం కొనసాగుతుందని అన్నారు.
ఈ సందర్భంగా పల్లెలన్నీ రంగవల్లులు, గొబ్బెమ్మలతో నిండి ప్రకృతి రమణీయతను సంతరించుకుంటాయని కేసీఆర్ తెలిపారు. సంక్రాంతి శోభతో రాష్ట్రవ్యాప్తంగా సంతోషాలు వెల్లివిరుస్తాయని అన్నారు.
దక్షిణం నుంచి ఉత్తరాయణానికి సూర్యుడు ప్రవేశించే మకర సంక్రాంతి పర్వదినం, హిందూ శాస్త్ర పురాణాల్లో ప్రత్యేకతను సంతరించుకున్నదని కేసీఆర్ తెలిపారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన వ్యవసాయాభివృద్ధిని ఈ సందర్భంగా స్మరించుకున్న కేసీఆర్ గారు, రాష్ట్ర వ్యవసాయరంగం, రైతాంగ సంక్షేమం తిరిగి గాడినపడి, తెలంగాణ సుభిక్షంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు.