(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం సీనియర్ జర్నలిస్టుల అరెస్ట్ అక్రమం
తెలంగాణ జర్నలిస్టు ఫోరమ్ అధ్యక్షుడు పల్లె రవి కుమార్ గౌడ్
రాష్ట్ర కేబినెట్ లోని మంత్రిపై NTV మీడియాలో ప్రసారమైన కథనంలో భాగంగా సీనియర్ జర్నలిస్టులైన దొంతు రమేశ్, పరిపూర్ణ చారి, సుధీర్ ను అరెస్ట్ చేయటాన్ని తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ తీవ్రంగా ఖండిస్తోంది. ‘సిట్’ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం కనీసం సదరు జర్నలిస్టులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నేరుగా అరెస్ట్ చేయటం అత్యంత దారుణం. ఓ మీడియా కథనంలో ప్రసారమయ్యే కథనాలకు ఆ సంస్థ ఎడిటర్ తో పాటు సంస్థ ఛైర్మన్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ ఆ సంస్థలో పని చేసే ఉద్యోగులను అరెస్ట్ చేయటమేంటి…?
ప్రజాపాలన అని చెబుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం…ఈ వ్యవహారంపై నిష్పాక్షపాతంగా విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి. జర్నలిజంలో 3 దశాబ్ధాలుగా పని చేస్తున్న ఈ ముగ్గురు జర్నలిస్టులిపై కేసులు నమోదు చేయటం వెనక కుట్ర ఉన్నట్లు కనిపిస్తోంది. సమాజా శ్రేయస్సు కోసం నిరంతరం పాటుపడే సదరు జర్నలిస్టులు…. తెలంగాణ ఉద్యమంలోనూ ముందుండి పోరాటం చేశారు. బహుజన వర్గాలకు చెందిన జర్నలిస్టులను సిట్ అరెస్ట్ చేయటాన్ని తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ పలు ప్రశ్నలను సంధిస్తోంది.
మంత్రిపై ప్రసారమైన కథనంపై నిష్పాక్షపాతంగా విచారణ జరిపించి… సంస్థ యాజమాన్యంపై కేసులు నమోదు చేసి విచారణ జరిపించాలి. .సంస్థ యాజమాన్యం అనుమతి లేకుండా ఏ వార్త కూడా ప్రసారం కాదు. కానీ పెద్దలుగా ఉన్న వారిని విడిచిపెట్టి… సామాన్య ఉద్యోగులను బలి చేయటం చూస్తుంటే దీని వెనక ఏదో కుట్ర ఉందని అర్థమవుతోంది.
* సంస్థలో పని చేసే రిపోర్టర్లకు రకరకాలుగా సమాచారం చేరుతుంది. ఈ సమాచారాన్ని క్రోడీకరించి ప్రసారం చేసేందుకు సంస్థ అనుమతి తప్పకుండా ఉంటుంది. అసలు మంత్రికి సంబంధించిన సమాచారం ఎక్కడ్నుంచి వచ్చింది..? ప్రసారం చేసేందుకు తెర వెనక నడిపించింది ఎవరు..? అనే దానిపై దర్యాప్తు జరిపించాలి.
* ముందుగా యాజామాన్యాన్ని అదుపులోకి తీసుకుని విచారించాలి. అంతేకానీ పెద్ద తలకాయలను వదిలేసి… సంస్థలో పని చేసే సాధారణ ఉద్యోగులను బలి చేయటం చేసేలా కుట్ర జరుగుతున్నట్లో కనిపిస్తోంది. ఈ పరిణామాలను తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ తీవ్రంగా ఖండిస్తోంది.
* సీనియర్ జర్నలిస్టులైన రమేశ్, పరిపూర్ణ చారి,సుధీర్ ను వెంటనే విడుదల చేయాలి. కేసును కూడా వెంటనే ఎత్తివేయాలి.
* రాజ్యాంగం చేతబట్టి దేశమంతంటా పర్యటిస్తున్న రాహుల్ గాంధీ … జర్నలిస్టుల అరెస్ట్ పై వెంటనే స్పందించాలి.
* వ్యక్తితత్వ హననానికి సంబంధించిన కథనాలను తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ ఎట్టి పరిస్థితుల్లో సమర్థించదు. కానీ అసలు కారుకులను విడిచిపెట్టి… అమాయకులైన వారిని కేసులు పెట్టి వేధించవద్దనేదే మా డిమాండ్.
తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ ( TJF) పల్లె రవి కుమార్ (అధ్యక్షుడు. మేకల కృష్ణ(జనరల్ కార్యదర్శి) ముద్దం స్వామి (Deputy జనరల్ సెక్రటరీ) పోగుల ప్రకాశ్ (వైస్ ప్రెసిడెంట్)