(adsbygoogle = window.adsbygoogle || []).push({});
జహంగీర్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాల సందడి మొదలు.
షాద్ నగర్, నేటి సత్యం, జనవరి, 14 :: రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్ నియోజకవర్గము కొత్తూరు మండలంలో పరమ పవిత్ర పుణ్యక్షేత్రంలో జాంగిర్ దర్గా ఉర్సు సందడి. దర్గాను దర్శించుకున్న ఎల్గనమోని బ్రదర్స్ ప్రత్యేక ప్రార్థనలు చేసినారు. కుల మతాలకు అతీతముగా విరాజిల్లుతున్న హజరత్ జహంగీర్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలలో భాగంగా మొట్టమొదటి గుసూల్ షరీఫ్ కార్యక్రమం బుధవారం తెల్లవారుజామున ప్రారంభమైంది. ఉర్సు ఉత్సవాలకు ముందు దర్గాలో గుసుల్ షరీఫ్ (సంప్రోక్షణ) కార్యక్రమం సందర్భంగా భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) షాద్ నగర్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ ఎల్గనమోని రవీందర్ యాదవ్, మురళీకృష్ణ యాదవ్ సోదరులు ఈ కార్యక్రమానికి హాజరై బాబాకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆధ్యాత్మిక చింతనతో కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ప్రార్ధనలు నిర్వహించుకోవాలని ఎంతో చారిత్రాత్మకమైన ప్రదేశంగా ఉన్న హజరత్ జహంగీర్ పీర్ దర్గా పుణ్యక్షేత్రం వల్ల ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు వెల్లి విరియాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లలిత గోపాల్ నాయక్, మేళ్ళగూడ తండా సర్పంచ్ రవి నాయక్ నాయకులు పెంటనోళ్ళ యాదగిరి, శ్రీరాములు, ముఖీద్, సాలి, కుమార్, ఇంద్రసేనా రెడ్డి, అంజి రెడ్డి, గోపి నాయక్, యాదగిరి, నరసింహా చారి, లడ్డు, కొట్యా నాయక్ తదితరులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.