(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నిధులతో హైమాస్ లైట్లు ఏర్పాటు.
సర్పంచ్ కొమ్ము చంద్రశేఖర్.
తెలకపల్లి నేటి సత్యం జనవరి 14.మండల కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ల నిధులతో హైమాస్ లైట్లు ఏర్పాటు చేసినట్లు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొమ్ము చంద్రశేఖర్, ఉప సర్పంచ్ వారణాసి శ్రీనివాసులు తెలిపారు .
బుధవారం ఐమాక్స్ లేట్లఏర్పాటును పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ, గ్రామ దేవత ఈదమ్మ దేవాలయం, తెలంగాణ చౌరస్తాలోని మలేలమ్మ దేవాలయం, చంద్రారెడ్డి షాపు వద్ద, పోలీస్ స్టేషన్ ప్రధాన రోడ్డు దగ్గర ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఐమాస్ లైట్లు కోసం నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు వారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్1 హైమాస్ లైట్ల ఏర్పాట్లు పరిశీలిస్తున్న సర్పంచ్, వార్డు సభ్యులు, నాయకులు