Neti Satyam
Newspaper Banner
Date of Publish : 17 January 2026, 5:38 am Editor : Admin

గన్నేరువరo ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

గన్నేరువరంను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి.

  1. -కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అదికార ప్రతినిధి డా॥ కొనగాల మహేష్

గన్నేరువరం, నేటి సత్యం,జనవరి 16: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి  నూతనంగా ఎన్నికైన సర్పంచ్ రంగణవేని లచ్చినర్సు, నూతన పాలకవర్గాన్ని మర్యాదపూర్వకంగా కలిసి వారిని శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా గన్నేరువరం గ్రామానికి చెందిన కొనగల మహేష్ మాట్లాడుతూ నూతన పాలకవర్గం ఐక్యంగా పనిచేసి, గన్నేరువరం గ్రామన్ని అభివృద్ధి బాటలో నిలుపాలని, రాష్ట్రానికి ఆదర్శ గ్రామం గా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి వెంకటరెడ్డి, కరోబార్ మాధవరావు, వార్డు సభ్యులు, పురుషోత్తం జన శ్రీనివాస్, టేకు అనిల్‌, బోయున కుమార్, రంగణవేని సతీస్, మచ్చ సాయి కృష్ణ, వ్యతిరే విజేందర్, మంగరాపు లక్ష్మి, సందవేణి రాములు, ఎల్లేటి శ్రీకాంత్, దురుముట్ల కనకలక్ష్మి శ్రీనివాస్..లు పాల్గొన్నారు.