Neti Satyam
Newspaper Banner
Date of Publish : 19 January 2026, 6:41 am Editor : Admin

మహిళలు బిఆర్ఎస్ వైపు …




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం శేరిలింగంపల్లిలో మహిళలు బీఆర్ఎస్ వైపు భారీ అడుగులు

కాంగ్రెస్–బీజేపీల వైఫల్యానికి బలమైన సమాధానం!

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గోపీనగర్, నెహ్రూనగర్ ప్రాంతాల మహిళలు బీఆర్ఎస్ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారు. కాంగ్రెస్, బీజేపీల ప్రజావ్యతిరేక పాలనకు విసిగి, ఈరోజు మస్జిద్ బండా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు *మరబోయిన రవి యాదవ్ గారు* సమక్షంలో పెద్ద సంఖ్యలో మహిళలు కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు గుడ్‌బై చెప్పి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ చేరిక కార్యక్రమం *టి. సురేష్* నాయకత్వంలో జరిగింది.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం తప్ప ఇంకేమీ ఇవ్వలేకపోతోంది. కానీ మాజీ సీఎం కేసీఆర్ గారి పాలనలో మహిళలకు భద్రత, సంక్షేమం, ఆర్థిక బలాన్ని అందించే అనేక పథకాలు అమలయ్యాయని మహిళలు గుర్తుచేశారు.

🔹 మహిళా సంక్షేమంలో కాంగ్రెస్ పూర్తిగా ఫెయిల్

🔹 బీజేపీ మాటలకే పరిమితం

🔹 బీఆర్ఎస్ మాత్రమే ప్రజల కోసం పనిచేసిన పార్టీ

ఈ సందర్భంగా మారబోయిన రవి యాదవ్ మాట్లాడుతూ—

తెలంగాణలో మహిళల గౌరవం, భద్రత, అభివృద్ధి కోసం నిజంగా పనిచేసిన నాయకుడు కేసీఆర్ గారు. మహిళల ఆశలు, ఆకాంక్షలు బీఆర్ఎస్‌తోనే నెరవేరుతాయి. అందుకే ఈరోజు శేరిలింగంపల్లిలో మహిళలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ వైపు వస్తున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక”* అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా కొత్తగా పార్టీలో చేరిన మహిళలు మాట్లాడుతూ“మహిళల కోసం మాట్లాడేది బీజేపీ కాదు…

🔹 మహిళల కోసం పనిచేసింది కాంగ్రెస్ కాదు…

🔹 నిజంగా మహిళలను ఆదుకున్న పార్టీ ఒక్కటే—బీఆర్ఎస్ పార్టీ” అని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ యాదవ్, శ్రీశైలం యాదవ్, సురేష్  కొత్తగా పార్టీలో చేరిన ఎన్. సలోని, సుధాకుమారి, గోవిందమ్మ, మనోహరమ్మదేవి, జయమ్మ, లక్ష్మీదేవి, నైంద్రమ్మ, సంగీత, లక్ష్మీ, షమీమ్ బేగం, ఇంద్రయాని, సుకన్య, జయప్రియ, జయరాం, వాణి, రామదేవి, అఖిల, కానిజ్ ఫాతిమా తో పాటు పలువురు మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.