Neti Satyam
Newspaper Banner
Date of Publish : 20 January 2026, 12:35 pm Editor : Admin

ఇదేనండి ఎర్ర ఎర్రని తెలంగాణ.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఇదేనండి ఇదే నండి ఏర్రెర్రని తెలంగాణ ,

,కమ్యూనిస్టు గుండెకాయ,

కష్టజీవి కలల కోన,

బయట పడ్డ పేగులను పై పంచతో ఆదిమిపట్టి,

పగుతుర పై పగబట్టి,

ప్రాణాలను తీసినట్టి గొట్టె ముక్కల గోపాల్ రెడ్డి జన్మించిన జీవ గడ్డ

కమ్యూనిస్టుల వందేళ్ల ప్రస్థానం ఏ ఒక్కరి సోత్తో కాదు,

అన్ని అణచివేతలకు వ్యతిరేకంగా

అన్ని అధిపత్యాలకు వ్యతిరేకంగా

సాగిన ప్రస్థానం ఇది

కష్టజీవుల ఆత్మ గౌరవ ప్రకటన ఇది

త్యాగజీవుల ,

బుద్ధి జీవుల

బలిదానాల ప్రస్థానం

దేశంలోని సంపదలు ఏ ఒక్కరివో కాదని,

అవి శ్రమ జీవులవి అని

శ్రమ జీవులను

దిక్కూ, మొక్కు లేనోళ్ల ను తెరపైకి తెచ్చిన ప్రస్థానం

దిక్కూ మొక్కూ లేనోళ్ళను రాజ్యాధికారం దిశగా అడుగులు వేయించిన ఎర్రజెండా ధీరత్వపు ప్రస్థానం

ఎంత నెత్తురు పారిందో కదా

ఈ ఎర్ర జెండా ఇంత ఎరుపెక్కడానికి

నెత్తురు పోసి ఎత్తుకున్న పోరు జెండా ప్రస్థానం…

ఒక చేత్తో కన్నీళ్లను తుడుచుకుని,

ఇంకో చేత్తో ఎర్ర జెండా ఎత్తుకుని సాగిన ప్రస్థానం చూడు

అమర వీరుల స్థూపం చూడు

ఆ స్థూపం మీద ఎదురు గాలికి ఎదురీదుతూ ఎగురుతున్న ఎర్రజెండా ప్రస్థానం చూడు

ఎన్నికలు, ఓట్లు, సీట్లు ఇవన్నీ దింపుడు కళ్ళం ఆశలే నని

రాజ్యాధికారానికి…. రాజకీయ అధికారానికి తేడా తెలియనంత వరకు

రైతు కూలి కడుపు మంట

పేదోడి కోపం

నీకు అర్థం కావు

ఎర్రజెండా ప్రస్థానానికి అర్థమే ఉండదు

 

పోరాడేవాడిదే ఎర్రజెండా

శ్రమించేవాడిదే ఎర్రజెండా