Neti Satyam
Newspaper Banner
Date of Publish : 20 January 2026, 2:25 pm Editor : Admin

నూతన అంబులెన్స్ సేవలు ప్రారంభం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నూతన అంబులెన్స్ సేవలు ప్రారంభం.

గన్నేరువరం, నేటి సత్యం, జనవరి 20 :

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేట గ్రామంలో ఆడెపు రాజు అనే గ్రామస్తుడు తన మంచితనంతో గ్రామ ప్రజలకు అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంచాడు. గ్రామంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ తెలిపారు.

వారు ఈ అంబులెన్స్ ను గ్రామ పంచాయతీకి అప్పగించారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ

ఖాసీంపేట గ్రామం లాగ అందరూ అలోచించి ప్రతిఒక్క గ్రామపంచాయితీలో అంబులెన్సు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటది ఎలక్షన్స్ లో గెలుపు కోసం పోటాపోటీగా ఖర్చు చేయడం కోసం వెనుకకు రాని నాయకులు ఇలాగ మీ స్వంత ఖర్చులతో మీ గ్రామాలలో ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలను కాపాడుతూ వారి ఆధారాభిమానాలు మన్నెలను పొందండి.

అని గ్రామస్తులు తెలిపారు.

ఈ సందర్భంగా నూతన సర్పంచ్ కె చంద్రయ్య మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మాకు ఈ అంబులెన్స్ అందించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కే చంద్రయ్య ఉపసర్పంచ్ ఐలయ్య,

వార్డు సభ్యులు ప్రజలు పాల్గొన్నారు.