(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఇది నా ఇలాకా.. అడుగుపెడితే తడాఖా చూపిస్తా..
ఆశావాహులది బస్తీమే సవాల్..
షాద్ నగర్, నేటిసత్యం, జనవరి 21 :: రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్ మున్సిపాలిటీ వార్డు ఎన్నికలలో ఇతర వార్డు అభ్యర్థుల పోటీ ఎంట్రీ వద్దు అంటున్నారు స్థానిక అభ్యర్థులు.
సాధారణంగా మున్సిపాలిటీ ఎన్నికలు అంటే అదే వార్డులో ఉండి పార్టీ తరపున పని చేసే వారికి అవకాశం ఇస్తుంటారు.. కానీ కొన్నిసార్లు కీలకమైన సందర్భాలలో అత్యవసర పరిస్థితుల్లో లెక్కలు మారుతుంటాయి.. వార్డుతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు రంగంలోకి దిగుతుంటారు.. దీనితో మొదటి నుంచి వార్డును నమ్ముకున్న ఆశావాహులు నిరాశకు గురవుతుంటారు. ప్రతి ఎన్నికల సమయంలో ఇది కనిపించే దృశ్యమే.. తాజాగా ఇదే అంశం మీద షాద్ నగర్ పట్టణ అధికార పార్టీ నేతల సమక్షంలోనే ఆశావాహుల మధ్య వివాదం చోటుచేసుకుంది. వివరంగా చెప్పుకుంటే..
*గతంలో ఇలానే జరిగింది…*
గత ఎన్నికలలో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపించింది. చైర్మన్ రేస్ లో ఉన్న కొందూటి నరేందర్ ను తనకు ఏమాత్రం సంబంధం లేని గాంధీనగర్ ప్రాంతంలో నిలబెట్టారు. కాంగ్రెస్ కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఫరూక్ నగర్లో ప్రాబల్యమున్న నాయకుడు బాబర్ ఖాన్ ను తెర మీదికి తెచ్చారు. అదేవిధంగా వైస్ చైర్మన్ రైస్ లో ఉన్న ఎమ్మెస్ నటరాజన్ ఫరూక్ నగర్ కు చెందిన నాయకుడు కాగా అతన్ని ఏమాత్రం సంబంధంలేని క్రిస్టియన్ కాలనీ వార్డు నుంచి నిలబెట్టారు. దీనితో ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆశావాహులు నిరాశకు గురై స్వతంత్రంగా పోటీ చేసే పరిస్థితి ఎదురైంది. దీనివల్ల అవతలి పార్టీలు నష్టపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ప్రధాన పార్టీలు సీట్ల సర్దుబాటులో భాగంగా ఇలాంటి ప్రయోగాలు చేయడం, ఆశావాహులు తప్పనిసరి పరిస్థితుల్లో త్యాగాలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి కూడా