కాంగ్రెస్ కుట్రలపై చిర్రా రవీందర్ యాదవ్ నిరసన
శేర్లింగంపల్లి 23 జనవరి
జె శ్రీనివాస్
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసిhb రవీందర్ యాదవ్ ఆందోళన
సీఎం రేవంత్ కు వ్యతిరేకంగా నినాదాలు
సిట్ పేరుతో కేటీఆర్ ను ఇబ్బంది పెట్టేలా సీఎం రేవంత్ కుట్రలు
రవీందర్ యాదవ్ తో పాటు బీ ఆర్ ఎస్ పార్టీ శ్రేణులను అరెస్ట్ చేసిన పోలీస్ లు
రేవంత్ డ్రామాలను ప్రజలు చూస్తున్నారు
కాంగ్రెస్ కుంభకోణాలపై అలుపెరగని పోరాటం చేస్తాం
కేటీఆర్ ను కేసులతో ఆపలేరు
మా నాయకుడు కేటీఆర్ పై అక్రమ కేసులను ఎదురుకుంటాం
కడిగిన ముత్యం వాళ్లే కేటీఆర్ బయటకి వస్తారు
కేటీఆర్ ను చూసి సీఎం రేవంత్ బయపడుతున్నాడు
రేవంత్ కుట్రలు తెలంగాణలో సాగనివ్వం
శేరిలింగంపల్లి యువ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత చిర్రా రవీందర్ యాదవ్ ధ్వజం
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి శేరిలింగంపల్లి యువ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత చిర్రా రవీందర్ యాదవ్ ఆందోళన చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలపై చిర్రా రవీందర్ యాదవ్ నిరసన తెలిపారు. పోలీస్ స్టేషన్ ముందు రోడ్డుపై తన అనుచరులతో కలిసి బైటాయించారు. సీఎం రేవంత్ కు వ్యతిరేకంగా చిర్రా రవీందర్ యాదవ్ నినాదాలు చేశారు. సిట్ పేరుతో కేటీఆర్ ను ఇబ్బంది పెట్టేలా సీఎం రేవంత్ కుట్రలు చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలిపిన రవీందర్ యాదవ్ తో పాటు బీ ఆర్ ఎస్ పార్టీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా చిర్రా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. రేవంత్ డ్రామాలను ప్రజలు చూస్తున్నారని, కాంగ్రెస్ కుంభకోణాలపై అలుపెరగని పోరాటం చేస్తామని వెల్లడించారు. తమ నాయకుడు కేటీఆర్ ను కేసులతో ఆపలేరన్నారు. కేటీఆర్ పై పెట్టిన అక్రమ కేసులను ఎదురుకుంటామన్నారు. కడిగిన ముత్యం వాళ్లే కేటీఆర్ బయటకి వస్తారని చిర్రా రవీందర్ యాదవ్ తెలిపారు. కేటీఆర్ ను చూసి సీఎం రేవంత్ బయపడుతున్నాడని చెప్పారు. రేవంత్ కుట్రలు తెలంగాణలో సాగనివ్వమని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ పాలన గాలికి వదిలేసిందన్నారు. మూర్ఖత్వంతో బిఆర్ఎస్ పార్టీ నాయకుల పై అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పారు. పగ , ప్రతీకారలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని మండిపడ్డారు. అనాగరిక భాషతో బిఆర్ఎస్ నాయకులను తిట్టడమే సరిపోతోందన్నారు. ఫ్యూచర్ సిటీ పేరుతో బినామీలకు కట్టబెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశాలు లేవని, మా నాయకులు ప్రచారం చెయ్యకుండా, రాజకీయ విషపు క్రీడ రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వేల కోట్ల కుంభకోణం పై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఎందుకు వెయ్యడం లేదని చిర్రా రవీందర్ యాదవ్ డిమాండ్ చేశారు. సిట్ లు కేవలం ప్రతి పక్షాల నాయకుల మీదనేనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసి కేసులు పెట్టిన కేటీఆర్ కడిగిన ముత్యం లాగా బయటికి వస్తారని చిర్రా రవీందర్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.