Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogవసంత పంచమి పేరుతో ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి

వసంత పంచమి పేరుతో ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి

*వసంతపంచమి పేరుతో ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్ స్కూల్స్ పై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా ఆఫీస్ బేరర్స్ డిమాండ్.*

నేటి సత్యం రంగారెడ్డి జనవరి 24

రంగారెడ్డి జిల్లా వివిధ మండలాలో వసంత పంచమి పేరుతో కార్పొరేట్, ప్రవేట్ పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆఫర్లతో అడ్మిషన్లు చేస్తున్న పాఠశాలల చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా ఆడిషనల్ డీఈఓ పూర్ణచందర్ రావు గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వివిధ మండలాలలో ప్రవేట్ కార్పొరేట్ పాఠశాలలో విద్యా వ్యాపారం దిశగా 2025-26 విద్యాసంవత్సరం గడవకముందుకే, వసంత పంచమి పేరుతో 2026-2027 విద్యా సంవత్సరంకి గాను నోఅడ్మిషన్ ఫీ, డిస్కౌంట్ల పేరుతో ముందస్తు అడ్మిషన్లు బహిరంగంగా ఇస్టాను రాజ్యాంగ చేపడుతున్నారు. అడ్మిషన్లు ఫీ, బుక్స్, డ్రెస్, టై, బెల్ట్ పేర్లతో లక్షలకు లక్షలు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి విద్య పేరుతో వ్యాపారం చేస్తు ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై చట్టపరమైన చర్యలు తీసుకోగలరని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమలో ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమైక్య రంగారెడ్డి జిల్లా ఆఫీస్ బేరర్స్ జిల్లా సహా కార్యదర్శి కె.శివ,జే. ధర్మ తేజ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు పి.వినోద్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ టీ. నితీష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments