Neti Satyam
Newspaper Banner
Date of Publish : 24 January 2026, 10:07 am Editor : Admin

ఎస్సీ ఎస్టీ కేసుల నమోదులో పోలీస్ స్టేషన్ బెయిల్ విధానం రద్దు చేయాలి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఎస్సీ ఎస్టీ కేసుల నమోదు లో పోలీస్ స్టేషన్ బెయిల్ విధానం రద్దు చేయాలి.

నేటి సత్యం గుంటూరు జనవరి 24

జాతీయ సమితి సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టిన

జాతీయ సమితి సభ్యురాలు పొన్నగంటి లావణ్య

SC, ST అట్రాసిటీ కేసుల నమోదు ప్రక్రియలో పోలీసులు అనుసరిస్తున్న పోలీస్ స్టేషన్ బెలు విధానం ఆలస్యం చేసే పద్ధతి నీ తక్షణమే రద్దు చేయాలని జాతీయ సమితి సభ్యురాలు పొన్నగంటి లావణ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు జాతీయ సమితి సమావేశం జనవరి 23-24 గుంటూరు లో జరిగిన సమావేశంలో ఆమె కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా పొన్నగంటి లావణ్య మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు కేసు నమోదు చేయకుండా, ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు తిప్పడం, ఫిర్యాదును స్వీకరించడంలో ఆలస్యం చేయడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఇది బాధితుల హక్కులను హరించే చర్యగా మారుతోందని, దీనివల్ల న్యాయం మరింత దూరమవుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.SC, ST అట్రాసిటీ చట్టం స్పష్టంగా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అమలు లోపాల వల్ల బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఎలాంటి ముందస్తు విచారణలు, బెలు విధానాలు లేకుండా ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేయాలని ఆమె స్పష్టం చేశారు.ఈ తీర్మానానికి జాతీయ సమితి సభ్యులు మద్దతు తెలుపుతూ, కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. SC, STల రక్షణకు ఉద్దేశించిన చట్టాలను నీరుగార్చే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సమావేశం డిమాండ్ చేసింది.