(adsbygoogle = window.adsbygoogle || []).push({});
పార్టీ నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం*
రాజకీయ గురువుకు శాలువాతో పాదాభివందనం చేసిన సీపీఐ నేత*
సయ్యద్ ఆఫ్సార్‌కు ఘన సన్మానం చేసిన మండల నాయకులు*
ఆఫ్సార్ మార్గదర్శకత్వంలో భూ పోరాటాలు కొనసాగిస్తాం*
నా రాజకీయ గురువును గౌరవించడం గర్వంగా ఉంది – నర్రగిరి*
నేటి సత్యం శంషాబాద్: జనవరి 24 సీపీఐ పార్టీ పట్ల నిబద్ధత, నాయకుల పట్ల గౌరవానికి ప్రతీకగా నిలిచేలా సీపీఐ మండల కార్యదర్శి నర్రగిరి తన రాజకీయ గురువు, సీపీఐ సీనియర్ రాష్ట్ర నాయకులు సయ్యద్ ఆఫ్సార్‌ను శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శాలువాతో పాదాభివందనం చేసి గౌరవం చాటారు.శంషాబాద్ మండలంలో నిర్వహించిన ఈ సన్మాన కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్. యాదగిరి, మండల కార్యదర్శి నర్రగిరి, జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అన్నెపు ప్రభు తదితర సీపీఐ నాయకులు పాల్గొన్నారు.
*ఈ సందర్భంగా నర్రగిరి మాట్లాడుతూ.*. తన రాజకీయ జీవితానికి మార్గదర్శకుడిగా నిలిచిన సయ్యద్ ఆఫ్సార్‌ను ఆయన స్వగృహంలో కలిసి సన్మానించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. పార్టీ కోసం, ప్రజల కోసం పోరాడే తత్వాన్ని తనలో నాటిన రాజకీయ గురువు ఆఫ్సార్ సూచనలు, సలహాలతో భవిష్యత్తులో పార్టీకి మరింత అంకితభావంతో పని చేస్తానని ఆయనకు మాట ఇచ్చానన్నారు.శంషాబాద్ మండలంలోని చారినగర్ భూ పోరాటాన్ని విజయవంతంగా నిర్వహించి పేదలకు పట్టాలు ఇప్పించడంలో సయ్యద్ ఆఫ్సార్ పాత్ర చారిత్రాత్మకమని నర్రగిరి గుర్తు చేశారు. ఎన్నో భూ పోరాటాలకు నాయకత్వం వహించి, పేదల హక్కుల కోసం నిరంతరం ఉద్యమించిన ఆయన అనుభవం, ఉద్యమ స్ఫూర్తి తనకు ప్రేరణగా నిలిచిందన్నారు.భవిష్యత్తులో కూడా సయ్యద్ ఆఫ్సార్ మార్గదర్శకత్వంలో పేదలు, కార్మికుల హక్కుల సాధన కోసం భూ పోరాటాలను మరింత ఉద్ధృతంగా కొనసాగిస్తామని నర్రగిరి స్పష్టం చేశారు. సీపీఐ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఉద్యమ పంథాలో ముందుకు సాగుతామని తెలిపారు.