Neti Satyam
Newspaper Banner
Date of Publish : 26 January 2026, 12:00 pm Editor : Admin

చంద్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

77 వ భారత గణతంత్ర దినోత్సవం హైదరాబాద్ కొండాపూర్ లోని చండ్ర రాజేశ్వర రావు ఫౌండేషన్ లో ఘనంగా నిర్వహించబడింది . సి ఆర్ ఫౌండేషన్ కార్యదర్శి చెన్నమనేని వెంకటేశ్వర రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

నేటి సత్యం శేరిలింగంపల్లి జనవరి 26

ఈ సందర్భంగా సి ఆర్ పాలిక్లినిక్ డైరెక్టర్ డాక్టర్ కె. రజని, మహిళా సంక్షేమ కేంద్రం డైరెక్టర్ శ్రీమతి జోస్యభట్ల కల్పన, డాక్టర్ అడపా రామారావు ప్రసంగించారు.

కుల వివక్షత, వర్ణ వివక్షత లేని సమాజం కావాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఏకమవ్వాలని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయకుండా తూట్లు పరుస్తున్నారు. రాజ్యాంగాన్ని రాజ్యాంగ విలువలను కాపాడుకోవడానికి మనమందరం పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.

మహిళా సంక్షేమ కేంద్రం సభ్యులు వి లలిత,

హోమ్ కమిటీ సభ్యులు రాజేంద్ర రావు, తమ్మారెడ్డి తాన్య, హోమ్ మేనేజర్ శ్రీనివాస్, తదితరులు, ఆశ్రమ వాసులు పాల్గొన్నారు

సి ఆర్ ఫౌండేషన్ కోశాధికారి, వృద్ధాశ్రమం

డైరెక్టర్ వి. చెన్నకేశవరావు కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా సంక్షేమ కేంద్రం విద్యార్థినులు దేశభక్తి గీతాలు ఆలపించారు.