Neti Satyam
Newspaper Banner
Date of Publish : 26 January 2026, 2:46 pm Editor : Admin

శేరిలింగంపల్లిలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం  ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.. జాతీయ జెండాను ఎగురవేసిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ గౌరవ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ గారు*

శేరిలింగంపల్లి డివిజన్ లోగల GHMC జోనల్ కార్యలయంలో గణతంత్ర దినోత్సవంను పురస్కరించుకుని ఏర్పాటుచేసిన జాతీయ జెండాను జోనల్ కమీషనర్ శ్రీ హేమంత్ భోర్కడే IAS గారితో తదితర డివిజన్ల గౌరవ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, జిహెచ్ఎంసి సంబంధిత అధికారులు, పురప్రముఖులతో కలిసి ఆవిష్కరించి గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం కార్పొరేటర్ గారి వార్డు కార్యాలయ ఆవరణలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారిచే జాతీయ జెండాను ఎగురవేసి మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు.

అనంతరం సుదర్శన్ నగర్ కాలనీ కమిటీ హాల్, సుదర్శన్ నగర్ రోడ్డు నెం. 4, గోపినగర్, ఆదర్శ్ నగర్ రోడ్డు నం 2, ఆదర్శ్ నగర్ కమిటీ హాల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, హుడా ట్రేడ్ సెంటర్, రామయ్య నగర్ కాలనీ, లింగంపల్లి బోరింగ్, లింగంపల్లి విలేజ్ అర్చ్, జయశంకర్ సర్కిల్, పాపిరెడ్డి కాలనీ, సురభి కాలనీ, ఎంపీపీఎస్ సురభి కాలనీ, ఆర్జికే అంబేద్కర్ సెంటర్, ఆదర్శ్ నగర్ రోడ్డు నెం. 3, బాపునగర్ హనుమాన్ యూత్, ఇందిరా నగర్, గచ్చిబౌలి చిన్న అంజయ్య నగర్ మరియు పలు కాలనీలలో, బస్తీలలో ఆయా స్థానిక నాయకులతో, పాఠశాల హెచ్ఎం లతో, అసోసియేషన్ సభ్యులతో కలిసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు, రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుధ్ యాదవ్ గారు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వివిధ రంగాలలో రాణించిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేసిన కార్పొరేటర్ గారు.

గోపినగర్ అంబేద్కర్ భవనంలో గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని జన చైతన్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ విజన్ ఐ కేర్ హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి పరీక్షల శిబిరంను పరిశీలించి, స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ సందర్బంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు 77 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఐక్యత అభివృద్ధికి ప్రేరణస్తూ జాతీయ జెండా ఎప్పుడు వెళుతూ ఉండాలని, స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుని వారి ఆదర్శాలకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, పలువురు అధికారులు, యువ నాయకులు, బస్తీ కమిటీ అధ్యక్షులు, బూత్ కమిటీ మెంబర్లు, మహిళా నాయకురాళ్లు, కాలనీ అసోసియేషన్ అనుబంధ సంఘ ప్రతినిధులు, శ్రేయోభిలాషులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.