Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogరాజ్యాంగాన్ని అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వాలు సిపిఐ రామకృష్ణ

రాజ్యాంగాన్ని అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వాలు సిపిఐ రామకృష్ణ

నేటి సత్యం భారత గణతంత్ర దినోత్సవాన్ని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ (AIYF) ఆధ్వర్యంలో ఘనంగా, స్ఫూర్తిదాయకంగా నిర్వహించామని AIYF నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సభ్యులు టీ రామ కృష్ణ గారు జాతీయ జెండాను ఎగరవేసి, భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్ర్య సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరులను స్మరించుకొని, రాజ్యాంగ విలువలను పరిరక్షించేందుకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.

AIYF నాయకులు మాట్లాడుతూ —భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛలు, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం వంటి మౌలిక విలువలను యువత ముందుండి కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో యువత పాత్ర అత్యంత కీలకమని, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం AIYF ఎల్లప్పుడూ పోరాటంలో ముందుంటుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో CPI రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ, శేరిలింగంపల్లి మండల కార్యదర్శి కె. చందు యాదవ్, DHPS రాష్ట్ర కార్యదర్శి కంటే వెంకట స్వామి, సహాయ కార్యదర్శులు ఎం. వెంకటేష్, జె. శ్రీనివాస్, అలాగే కున సుధాకర్, కున ఖాసీం, ఎస్. కొండల్, టి వరలక్ష్మిబి. నారాయణ, ఏ ఐ వై ఫ్ శేరిలింగంపల్లి మండల కార్యదర్శి కె శివ కుమార్,ఎం అశోక్,తిరుపతి,టీ మల్లేష్ ఎస్ రాఘవేంద్ర,, బి. రామస్వామి, వెంకటమ్మ , చిట్టమ్మ తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments