రాజ్యాంగాన్ని అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వాలు సిపిఐ రామకృష్ణ
నేటి సత్యం భారత గణతంత్ర దినోత్సవాన్ని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ (AIYF) ఆధ్వర్యంలో ఘనంగా, స్ఫూర్తిదాయకంగా నిర్వహించామని AIYF నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సభ్యులు టీ రామ కృష్ణ గారు జాతీయ జెండాను ఎగరవేసి, భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్ర్య సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరులను స్మరించుకొని, రాజ్యాంగ విలువలను పరిరక్షించేందుకు...