(adsbygoogle = window.adsbygoogle || []).push({});
అఖిల భారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి
ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి పర్వతాలు పిలుపు
నేటి సత్యం.. నాలుగు లేబర్ కోడ్ లను వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 12న దేశ వ్యాప్త సార్వత్రిక కార్మిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి పర్వతాలు . సిఐటియు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జి కవిత .పిలుపునిచ్చారు
మంగళవారం నాడు శంషాబాద్ మండల కేంద్రంలోని హోటల్ ఎలైట్ లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు
నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లోకి మార్చి చట్టాలను నిర్వీర్యం చేయడానికి వ్యతిరేకిస్తూ దేశంలోని అఖిలభారత కార్మిక సంఘాలు అన్ని కలిసి ఐక్యంగా ఈ సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని ఆయన తెలిపారు
వ్యవసాయ నల్ల చట్టాలను తెచ్చి వ్యవసాయ రైతులు తీవ్రంగా దెబ్బతీసిన మోడీ ప్రభుత్వం విద్యుత్తు నూతన చట్టాలతో వినియోగదారులపై ప్రజలపై తీవ్రమైన భారాలు మోపడాని ఏఐటియు సిఐటియు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు
దేశంలో రోజురోజుకు నిరుద్యోగం పెరిగిపోతున్న అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని ఆయన విమర్శించారు
దేశంలో కార్పొరేటు పెట్టుబడిదారుల దోపిడీ అధికమైందని అన్నారు
ఫిబ్రవరి 12న తుక్కుగూడలో కార్మిక సంఘాల జిల్లా సదస్సు లక్ష్మీ గార్డెన్లో జరుగుతుందని ఈ సదస్సుకు కార్మికులు పెద్ద ఎత్తున హాజరై సదస్సును విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ సమావేశంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు కే రంగస్వామి సిఐటియు జిల్లా అధ్యక్షుడు రుద్రకుమార్ ఏఐటియుసి జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి దత్తు నాయక్ సిపిఐ శంషాబాద్ మండల కార్యదర్శి నర్రగిరి పాల్గొన్నారు