సమస్యల పరిష్కారం కోసం సభ్యుల
సంక్షేమం కొరకు పోరాడేదే నిజమైన సంఘం..
(యస్.పి. మల్లికార్జున సాగర్).
కొల్లాపూర్, నేటి సత్యం, జనవరి 28.
సమస్యల పరిష్కారం కోసం, సంఘం లోని సభ్యుల సంక్షేమం, అభివృద్ధి కొరకు పోరాడేది నిజమైన సంఘ మని, అంతే తప్ప సంఘం చిన్నదా..? పెద్దదా..?, సంఘం లో ఎంత మంది సభ్యులు ఉన్నారు అనేది ప్రాధాన్యత కాదని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ( టిడబ్ల్యూజేఎఫ్ )
జాతీయ కౌన్సిల్ సభ్యులు యస్.పి. మల్లికార్జున సాగర్ అన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం లో బుధవారం రోజు టీ డబ్ల్యూ జే ఎఫ్ నాగర్ కర్నూల్ నియోజకవర్గ కమిటీ సమావేశం జరిగింది.
సమావేశం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న యస్.పి. మల్లికార్జున సాగర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎస్. రామచంద్రయ్య, నాగర్ కర్నూల్ జిల్లా టిడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షులు పరిపూర్ణం కార్యదర్శి వెంకటేష్ చారకొండ వెంకటేష్ తదితరులు మాట్లాడుతూ ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవో మూలము గా జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయాలను టీ డబ్ల్యూజేఎఫ్ ముందుగా వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి చేసిన సూచనలు, పోరాటా ల మేరకే ప్రభుత్వము తీసుకువచ్చిన జీవోను సరిచేయడము జర్నలిస్టులకు మేలు కలగజేసిందని వారన్నారు.
సంఘం పెద్దదా. ..? చిన్నదా..? సంఘం లో సభ్యులు ఎంతమంది ఉన్నారు. ? అనేది ముఖ్యము కాదని ఏ సంఘమైతే సంఘ సభ్యుల సంక్షేమం కొరకు , సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కొరకు కృషి చేసేది నిజమైన సంఘమని అదే మనుగడ కొనసాగిస్తుందని వారన్నారు.
సమాజం లోని సమస్యల పరిష్కారం కొరకు పేద ప్రజల అభ్యున్నతి కొరకు నిరంతరం ప్రజాప్రతినిధులతో కలిసి పనిచేసే జర్నలిస్టులు మాత్రం తమ సొంత కుటుంబాలను పట్టించుకోరని తమ సమస్యల పరిష్కారం కొరకు కృషి చేసుకోరు అని టి డబ్ల్యూ జేఎఫ్ నాయకులు అన్నారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కొరకు చేసే పోరాటాలకు జర్నలిస్టులందరూ సంఘాల కతీతం గా కలిసి రావాలని అలా కలిసి వచ్చి సంఘటితం గా పోరాటాలు చేసినప్పుడే జర్నలిస్టులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకో గలుగుతారనీ అందుకే జర్నలిస్టులంతా సమస్యల పరిష్కారం కొరకు సంఘటితమై పోరాటాలు చేసేందుకు కలిసి రావాలని టీ డబ్ల్యూ జే ఎఫ్ నాయకులు తోటి జర్నలిస్టు సంఘాల నాయకులకు పిలుపునిచ్చారు.
సమావేశం లో నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గ టి డబ్ల్యూ జె ఎఫ్ కార్య వర్గాన్ని ఎన్నుకొన్నారు.
సమావేశం లో జాతీయ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులకు నూతనం గా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు సంఘం తరఫున సన్మానం చేశారు.