Neti Satyam
Newspaper Banner
Date of Publish : 28 January 2026, 12:46 pm Editor : Admin

గవర్నర్ల తీరు.. గవర్నమెంట్ల పై పోరు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

‘గవర్నర్ల’తీరు…”గవర్నమెంట్ల”పై పోరు

నేటి సత్యం

గవర్నర్ల వ్యవస్థపై ప్రస్తుతం దేశంలో పెద్దయెత్తున చర్చ సాగుతున్నది. ఇది కొత్తగా ప్రారంభమైంది కాదు. ఇదివరకే వివాదాస్పదలతో వస్తూనే ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు కాకుండా ఇతర రాజకీయపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రభుత్వాలను ముప్పుతిప్పలు పెడుతున్న గవర్నర్ల వ్యవస్థ. ఇప్పుడు దాని తీవ్రత ఎక్కువ చేస్తుండ్రు. మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్‌డిఎ కూటమి గవర్నర్లు బస చేసే రాజభవన్ల పేరును లోక్ భవన్లుగా మార్చిందే తప్ప ఆ భవన్లలో కూర్చుని పని చేసే గవర్నర్ల విధివిధానాల్లో ఎటువంటి మార్పులు లేవు. పాత పాత్రకు కొత్త తరుగు పట్టించినట్లే ఉంది. అసలు గవర్నర్ల పాలన మన సాంప్రదాయం కానే కాదు… బ్రిటిష్ విధానాన్ని కొనసాగిస్తున్నాం. రాజకీయాల్లో అనుభవం ఉన్నవాళ్లను గవర్నర్లుగా చేస్తున్నాం.

ప్రజలు ఎన్నుకున్న సర్కార్ కి, గవర్నర్ల కి మధ్య లొల్లి తారాస్థాయిలో ఉంది. అసెంబ్లీ సమావేశాల తొలిరోజున గవర్నర్ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించాలన్నది విధానం కొనసాగిస్తున్నాం. గవర్నర్ ప్రసంగన్ని రాష్ట్ర కేబినెట్ రూపొందిస్తుంది. గవర్నర్ గారికి బయట ఏ రాజకీయాలు ఉన్నా అక్కడ మాత్రం తన ప్రభుత్వ నివేదికగానే ఆ ప్రసంగం చేయాలీ. అసత్యాలు ఉంటే ప్రతిపక్షాలు లేవనెత్తుతాయి. కానీ ఇక్కడ గవర్నర్ల వ్యవస్థ తీరు స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఎన్డిఏ పక్ష ప్రభుత్వాలు తప్ప ఏ ప్రభుత్వాలు ఉన్నా అక్కడ వివాదాలు ఉంటున్నాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒకప్పుడు తెలంగాణ గవర్నర్లు శాసనసభ్యులను ఉద్దేశించి సమావేశాల మొదటి రోజున చేసే ప్రసంగంలో తమకు నచ్చనివి, కేంద్రానికి అనుకూలంగా లేనివి, చదవకుండా వదిలేయడం, మార్చుకోవడం చేస్తుండ్రు. కొత్తగా ప్రతిపక్షాలు చేస్తున్నట్లుగా గవర్నర్లు అసెంబ్లీ నుండి వాకౌట్లు చేస్తున్నారు. చట్టసభల్లో ప్రతిపక్ష సభ్యులు తమ వాదన వినిపించే అవకాశం లేకనో, తమకు అన్యాయం జరుగుతుందని భావిస్తేనో వాకౌట్లు చేయాలి.

గవర్నర్లను నియమించే అధికారం కేంద్రానికి ఉన్నంత మాత్రాన కేంద్రానికి సైనికుడుగా ఉండాల్సిన అవసరం లేదు. అది రాజ్యాంగబద్ధ పదవి. గవర్నర్ల పదవికి వెళ్లి తెచ్చేవాళ్ళు చూస్తే ప్రస్తుతం అయితే ఆ సంఖ్య లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రానికి అనుకూలంగా ఉన్న గవర్నర్ల సంఖ్య అధికంగా ఉంది. గవర్నర్ల తీరు పట్ల సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ మధ్య సుప్రీంకోర్టు ఒక సంచలన నిర్ణయం ప్రకటించింది. రాష్ట్రప్రభుత్వాలు ఆమోదం కోసం పంపే బిల్లులను గవర్నర్ల దగ్గర 3 నెలలకు మించి పెండింగ్‌లో ఉన్నట్లయితే అవి ఆమోదం పొందినట్టుగానే భావించాలన్నది తీర్పు… కానీ మళ్ళీ దాన్ని వినకకు తీసుకోవాల్సి వచ్చింది. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టేందుకు కేంద్రం ఎంపిక చేసి మరీ కొంతమందిని గవర్నర్లుగా పంపడం చూస్తున్నానామ… గవర్నర్ల వ్యవస్థ అవసరమే కానీ ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వాల పాలనకు ఇబ్బంది లేకుండా అవసరమైన సంస్కరణలు రావాలి. రాష్ట్రంలోని పరిస్థితుల గురించి కేంద్రానికి గవర్నర్లు నివేదిక ఇవ్వడం సహజం. అయితే అవి వాస్తవాలు అయి ఉండాలి కానీ అలా కాకుండా కేంద్ర పెద్దగా మెప్పుకోసం పాటుపడుతున్నారు.

మనం స్వయంగా చూసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో….. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కాలం పనిచేసిన గవర్నర్ నరసింహన్ను గుర్తుపెట్టుకోవాలి… ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో… యూపీఏ హాయంలో… అలానే తెలంగాణ వచ్చాక రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పష్టమైన, నాణ్యమైన నివేదికలు ఇవ్వడంలో నరసింహన్ ఒక్కరే మనం ప్రత్యక్షంగా చూసాం… తర్వాత వచ్చిన తమిళిసై, మిగతా వాళ్ళందరూ ఇబ్బంది పెట్టిన గవర్నర్లే. రాజకీయాల్లో ఉండేవారిని గవర్నర్లుగా నియమిస్తే ఏం జరుగుతుందో చరిత్రలో ఉంది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డినీ కాంగ్రెస్ పార్టీ తమిళనాడు గవర్నర్ గా పంపిస్తే… రాజకీయంగా అప్పటి ముఖ్యమంత్రి జయలలితను ముప్పుతిప్పలు పెట్టిన విషయం తెలిసిందే… పత్రికల్లో కూడా స్టేట్మెంట్లో స్వయంగా జయలలితనే ఇచ్చిండ్రు…గవర్నర్‌ను రీకాల్ చేయాల్సిందిగా ఆమె అప్పటి ప్రధాని పివి నరసింహారావుకు పరిస్థితిని తీసుకుపోయారు. కేరళలో ఏర్పాటైన మొట్టమొదటి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని రద్దు చేసేందుకు గవర్నర్ పంపిన నివేదికను ఉపయోగించుకోవడానికి అప్పటి కాంగ్రెస్ ఎన్నో ప్రయత్నాలు చేసింది. గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కూడా చాలా సార్లు డిమాండ్ చేసిండ్రు… రాష్ట్రాల సమూహమే కేంద్రం. మనది ఫెడరల్ వ్యవస్థ అయినప్పటికీ స్వతంత్ర రాజ్యాలు కావు కాబట్టి కేంద్రం ఉంటుంది.

అయితే ఎన్‌టిఆర్ గవర్నర్ల వ్యవస్థ రద్దు చేయమని డిమాండ్ చేసిండ్రు గాని ప్రత్యామ్నాయాన్ని సూచించ లేదు.

ఏది ఏమైనా గతంలో జైలవంతకు ఎన్టీ రామారావు దశ నుంచి ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో కేంద్రానికి వ్యతిరేకంగా ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వాలకు గవర్నర్ల భుజంపై తుపాకీ పెట్టి కేంద్రం చెలగాటమారుతోందనేది తెలుస్తోంది. నీ అంతకు దగ్గరగా స్వాతంత్రానికి దూరంగా దూరమైన విధానాలను ఉపకల్పన చేయడమే లక్ష్యంగా గవర్నర్ల రూపంలో ఆయా ప్రభుత్వాలపై రుద్దుతోంది. రాష్ట్రప్రభుత్వాల పట్ల గవర్నర్లు రాజకీయ కారణాలతో కక్షసాధింపుకు వెళ్లకుండా సుప్రీంకోర్టు చెప్పినట్లు స్నేహ బద్ధంగా, మార్గదర్శకంగా ఉండాలి.అలాంటి సంస్కరణలు రాకపోతే గవర్నర్ల వ్యవస్థ మరింత దారుణమైన పరిస్థితిను ఎదురుకోక తప్పదు.

పట్ట. హరి ప్రసాద్, రైటర్

ఫోన్: 8790 84 3009