4 లేబర్ కోడ్ లు రద్దు అయ్యే వరకు పోరాడండి. కార్మికులకు. సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమకల జంగయ్య పిలుపు
కార్మిక సమ్మెకు సిపిఐ మద్దతు
నేటి సత్యం శంషాబాద్ జనవరి 29 నాలుగు లేబర్ కోడ్ లు రద్దయ్య వరకు కార్మిక వర్గం తెగించి పోరాటం నిర్వహించాలని ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెకు సిపిఐ మద్దతు ఇస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి జాతీయ సమితి సభ్యుడు పాలమాకుల జంగయ్య తెలిపారు
నేడు శంషాబాద్ పట్టణంలోని కార్యాలయంలో ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మె కరపత్రాలను ఆయన కార్మిక నాయకులతో కలిసి విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా కార్మిక వర్గం పోరాడే సాధించుకున్న చట్టాలను నేటి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి వాటిని నిర్వీర్యం చేయడం దుర్మార్గమని ఆయన విమర్శించారు
వ్యవసాయ నల్ల చట్టాలను విద్యుత్తు చట్టాలను తక్షణమే ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశాడు
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని జి రాంజీ పేరుతో మార్చి ఆ పథకాన్ని నీరు కార్చాలని చూడడం బాధాకరమని ఆయన మండిపడ్డారు
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి పర్వతాలు మాట్లాడుతూ పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు అమలుకోవడం లేదని పనిగంటలు సక్రమంగా అమలు చేయకుండా కార్మికులను ఉద్యోగులను వేధిస్తున్న పరిశ్రమ యాజమాన్యాల పైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు
ఫిబ్రవరి 1న తుక్కుగూడ లో జరిగే కార్మిక సదస్సును విజయవంతం చేయాలని ఆయన కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు
కరపత్రం విడుదల కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కే రామస్వామి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బాతరాజు నరసింహ ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కె చందు యాదవ్ మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సక్రు నాయక్ ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యుడు మున్సిపల్ సంఘం నాయకుడు మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు