“మంచం” గుర్తుకు ఓటు వేయండి బిఎంపి అభ్యర్థులను గెలిపించండి.
- – బిఎంపి పార్లమెంట్ ఇంచార్జ్ గడ్డం విజయ్.
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో బహుజన్ ముక్తి పార్టీ నుండి 4 అభ్యర్థులను బరిలో నిలబెట్టడం జరుగుతుందని బహుజన్ ముక్తి పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ గడ్డం విజయ్ తెలిపారు.
2వ వార్డు నుండి బాకి పరుష రాములు
5వ వార్డు నుండి బి వెంకట్ రాములు
13వ వార్డు నుండి ఏ శివ కుమార్
16వ వార్డు నుండి కావలి రామకృష్ణ లను
బరిలో నిలెబెట్టడం జరిగిందని 2,5,13,16 వార్డులలో “మంచం” గుర్తుకు ఓటు వేసి మా యొక్క అభ్యర్థులను అత్యతిక మెజార్టీతో గెలిపించాలని నాగర్ కర్నూల్ ఓటర్లను కోరారు.
మిగతా వార్డులలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనేది త్వరలో నిర్ణయిస్తామని తెలిపారు.
పూలే -అంబేడ్కర్-కాన్షీరాం ఆశయాల సాధనలో ముందుకు వెళ్తూ బడుగు బలహీన వర్గాలకు ఆర్థిక,సామాజిక,రాజకీయ న్యాయం దక్కాలంటే బహుజన్ ముక్తి పార్టీ అభ్యర్థులను గెలించాలనీ కోరారు.నిరంతరం ప్రజాసమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తూ పేద,మధ్య తరగతి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరీయు అగ్రకుల పేదల అభివృద్ధియే బిఎంపి పార్టీ ఎజెండా అని తెలుపుతూ లంచం పోవాలంటే మంచం గుర్తు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు.