Neti Satyam
Newspaper Banner
Date of Publish : 31 January 2026, 11:52 am Editor : Admin

మనకు పూర్వజన్మ కర్మల వలనే… ఈ జన్మలో…




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మనకు పూర్వ జన్మ కర్మల వలననే…. II

ఈ జన్మలో…తల్లి, తండ్రి, అన్న, అక్క, భార్య, భర్త,

ప్రేమికుడు, ప్రియురాలు, మిత్రులు,

శత్రువులు మిగతా సంభంధాలు…

ఈ ప్రపంచం లో మనకు లభిస్తాయి.

ఎందు కంటే మనం వీళ్లకు…

ఈ జన్మ లో…

ఏదో ఒకటి ఇవ్వ వలసి, లేదా తీసుకొన వలసి రావచ్చును.

*మనకు సంతాన రూపం లో ఎవరెవరు వస్తారు.*

మనకు….

*పూర్వ జన్మ లో సంబంధం వున్న వాళ్ళే*

ఈ జన్మలో సంతాన రూపంలో జన్మిస్తారు, అవ్వే మన శాస్త్రాల ప్రకారం నాలుగు రకాలుగా వున్నట్లు చెబుతారు…

*ఋణాను బంధం*:-

గత జన్మ లో మనం ఎవరి వద్ద నైనా రుణం తీసు కుని వుండచ్చు. లేదా ఎవరో ఒకరి ధనాన్ని నష్ట పరచి వుండొచ్చు.

అటు వంటి వాళ్ళు మీకు సంతాన రూపం లో జన్మించి లేదా ఏ దైనా వ్యాధి రూపం లో వచ్చి మీ వద్ద వున్న పూర్తి ధనం ఖర్చు అయ్యే వరకూ వుండి ఆ పాత ఖర్చులు సరి సమానం అయ్యే వరకు మన తోనే వుంటారు.

*శత్రువులు – పుత్రులు*:-

మన పూర్వ జన్మ లో శత్రువులు మనపై వారు తమ తమ కక్షను తీర్చుకోవటానికి మన ఇంట్లో సంతాన రూపం లో తిరిగి పుడతారు.

అలా పుట్టి తల్లి దండ్రులతో పెద్దయ్యాక కొట్లాటలు,

నానా గొడవలూ చేస్తారు.

జీవిత మంతా ఏదో ఒక విషయం లో ఏడి పిస్తూనే వుంటారు.

ఎల్లప్పుడును తల్లితండ్రులను నానా యాతన పెడుతూ వాళ్ళ పరువు తీసి వాళ్ళను దుఃఖితులను చేస్తూ… ఆనంద పడు తుంటారు.

*తటస్థ పుత్రులు* :-

వీళ్ళు ఒక వైపు తల్లి తండ్రులకు సేవ చెయ్యరు…

మరో వైపు సుఃఖం గా కూడా వుంచరు,

వాళ్ళను వాళ్ళ మానానికి వాళ్ళను వది లేసి వెళ్తారు.

వాళ్ళ వివాహా నంతరం తల్లి దండ్రులకు దూరంగా జరిగి పోతారు.

*సేవా తత్పరత వున్న పుత్రులు*:-

గత జన్మలో మీరు ఎవరి కైనా బాగా సేవచేసి వుండవచ్చును, ఆ రుణాన్ని తీర్చు కోవటానికి మీకు కొడుకు లేదా, కుతూరు రూపం లో ఈ జన్మలో వస్తారు.

అలా వచ్చి బాగా సేవను చేస్తారు.

మీరు గతం లో ఏది చేసు కున్నారో ఇప్పుడు అదే సంప్రాప్తిస్తుంది.

మీరు గత జన్మలో ఎవరి కైనా సేవ చేస్తే,

ఈ జన్మలో మన ముదుసలి తనం లో మనకు సేవ చేస్తారు.

లేక పోతే మనకు వృద్ధాప్యం లో గుక్కెడు నీళ్లు పోసే వారు కూడా మన వద్ద వుండరు.

ఇది పూర్తిగా మనుష్యులకు మాత్రమే అమలు అవుతుంది.

అని అను కోవద్దు.

ఈ క్రింద చెప్పిన ప్రకారం ఎలాంటి విధంగా నైనా పుట్ట వచ్చును.

ఒక వేళ మీరు ఒక ఆవుకి నిస్వార్థమైన సేవ చేసి వుండవచ్చును. వాళ్ళే మీ కొడుకు లేదా, కూతురుగా

మీ ఇంట పుట్ట వచ్చును.

ఒక ఆవుకి తన దూడకు సమంగా పాలు తాగ నియ్య కుండా దూరంగా వుంచిన పాపానికి వాళ్ళే కొడుకు లేదా, కూతురుగా మీ ఇంట పుడతారు.

లేదా మీరు ఏదైనా నిరప రాధి జీవిని సతాయించా రనుకో, వాళ్ళు మీకు శత్రువు రూపం లో పుట్టి మీతో తన గత శత్రుత్వం యొక్క కక్ష తీర్చు కుంటారు.

అందు కనే జీవితం లో ఎవరికీ కూడా కీడు, చెడు చెయ్య వద్దు.

ఎందు కనగా ప్రకృతి నియమం ప్రకారం మీరు ఏది చేస్తే…

దానికి ఈ జన్మ లో లేదా వచ్చే జన్మలో నూటికి నూరు శాతం ఎక్కువ చేసి అనుభవం లో కి తెస్తుంది.

మీరు ఒక వేళ ఎవరి కైనా ఒక్క రూపాయి దానం చేస్తే అది మీ ఖాతాలో నూరు రూపాయలుగా జమ చెయ్య బడతాయి.

ఒక వేళ మీరు ఎవరి వద్దయినా ఒక్క రూపాయి లాక్కుంటే మీ ఖాతా నుంచి నూరు రూపాయలు తీసి వేయ బడతాయి.

(అనగా పాప పుణ్యాలు)

కొద్దిగా ఆలోచించండి ”

మీరు మీతో కూడా ఎంత ధనాన్ని తెచ్చు కున్నారు.

మళ్లీ ఎంత ధనాన్ని

మీ వెంట తీసు కెళ్తారు..?

ఇప్పటి వరకు పోయిన వాళ్లు ఎంత బంగారం,

వెండి పట్టుకు పోయారు..?

మీరు పోయె ముందు మీ బ్యాంకు లో ఉన్న నగా,

నట్రా, డబ్బు మూలుగు తుందో అది పూర్తిగా పనికి రాని సంపాదన కాదా..?

ఒక వేళ మీ…మీ… సంతానం సమర్ధు లైతే మీరు వదిలిన డబ్బు దస్కం వాళ్లకు అనవసర వస్తువు కాదా..?

వాటి అవసరం వాళ్లకు లేదు కదా..?

ఒక వేళ వాళ్ళు ఆ డబ్బు దస్కం వాడు కున్నట్లయితే వాళ్ళు ఎందుకూ కొరగాని వాళ్ళుగా, చేతకాని వాళ్ళుగా అయిపోతారు కదా.

వాళ్ళు సదరు డబ్బు, నగానట్రా వాడు కుని కొద్ది రోజు ల్లోనే వాళ్ళని వాళ్ళే నాశనం చేసుకుని తీరుతారు. ఆ తర్వాతే వాళ్లకు శాంతి లభిస్తుంది.

నేను,

నాది,

నీది అన్నది.

అంతా ఇక్కడి కిక్కడే పనికి రాకుండా పోతుంది.

ఏది కూడా వెంట రాదు.

ఒకవేళ మీ వెంట వస్తే గిస్తే మీ పుణ్య ఫలం వెంట వస్తుంది.