Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogఇద్దరినీ చంపి తాను ఉరేసుకొని ఆత్మహత్య

ఇద్దరినీ చంపి తాను ఉరేసుకొని ఆత్మహత్య

ఇద్దరిని చంపి. తను ఉరివేసుకొని ఆత్మహత్య.

బెజ్జంకి, నేటి సత్యం, జనవరి 31:

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే జక్కని సత్తయ్య అనే వ్యక్తి తన తల్లి శారదని, తన కొడుకు సురేష్ ను హత్య చేసి అనంతరం తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలో చిన్న హోటల్ నడుపుకుంటూ జీవనం సాగించేవాడు గత రెండు మూడు రోజులుగా తను హోటల్ బందు చేశాడు. అని గ్రామస్తులు తెలిపారు. ఈ హత్యలకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రాథమిక సమాచారం అందుకున్న సిద్దిపేట జిల్లా ఏసిపి రవీందర్ రెడ్డి,సిఐ శ్రీను, బెజ్జంకి ఎస్సై సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన తెలుసుకున్న సిద్దిపేట జిల్లా సిపి రష్మీ పెరుమాళ్ స్వయంగా సంఘటన స్థలానికి చేరుకొని విచారణ మొదలుపెట్టారు. విచారణలో భాగంగా కీలక ఆధారాలు సేకరించారు. సత్తయ్య భార్య దేవవ్వను విచారించి వివరాలు తెలుసుకున్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో విచారణ చేపడుతా మని సిపి తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments