Neti Satyam
Newspaper Banner
Date of Publish : 01 February 2026, 2:47 pm Editor : Admin

కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన బడ్జెట్ డొల్ల బడ్జెట్.. ఆర్కే




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

*కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ డొల్ల బడ్జెట్*

`టి రామకృష్ణ…సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు

కేంద్ర ఫ్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ డొల్ల బడ్జెట్..అని సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు టి రామకృష్ణ ఒక ప్రకటన ద్వారా విమర్శించారు. ఇందులో ఏ వర్గాలను సంతప్తి పరిచేవిధంగా లేదని వారన్నారు. అమెరికా టారీఫ్ భారం మోపడంతో ఇప్పటికే కూదేళ్ళవుతున్న తయారీ రంగం, ఇతర రంగాలకు ఈ బడ్జెట్ తోడ్పాటును అందించలేకపోయిందన్నారు. కేంద్ర బడ్జెట్ సమాఖ్య స్ఫూర్తిని మరింత దెబ్బతీసిందని పేర్కొన్నారు. ఉద్యోగాల కల్పన విషయంలో కూడా ఎలాంటి చర్యలు కల్పించలేదని, ప్రజలు ఎదుర్కొంటన్న తక్షణమ సమస్యలు నిరుద్యోగం, ద్రవ్యోల్భణం, ఆర్థిక అంతరాలపై తగిన చర్యలు తీసుకోకుండా 2047 వికసిత్ భారత్ పేరుతో ప్రజలను మభ్య పెడుతున్నారని ఆర్కే.విమర్శించారు. గుప్పెడు మంది చేతిలో సంపద కేంద్రీకరణను నియంత్రించేందుకు సంపద పన్ను విధించాలన్న డిమాండ్‌ను పెడచెవిన పెట్టిందని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసి బడాబాబులకు పెద్ద యెత్తున రుణాలు ఇచ్చే కుట్రలో భాగంగానే బ్యాంకింగ్ హై లెవల్ కమిటీ ప్రతిపాదించారని టి రామకృష్ణ అన్నారు