(adsbygoogle = window.adsbygoogle || []).push({});
*అమరుడు కామ్రేడ్ గంగుల నర్సన్న*
*స్మారక స్తూపం*
*కరపత్రం విడుదల*
నిజామాబాద్ జిల్లా కేంద్రం నాలుగవ డివిజన్ మాధవ నగర్ కామ్రేడ్ గంగుల నర్సన్న కాలనీలో
సిపిఐ (ఎంఎల్) నాయకులు
తెలంగాణ రైతు కూలీ సంఘం
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
*అమరుడు కామ్రేడ్ గంగుల నర్సయ్య స్మారక స్తూపం*
నిర్మాణ కోసం కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది
ఈ సందర్భంగా తెలంగాణ రైతు కులి సంఘం రాష్ట్ర కోశాధికారి
*భామండ్ల రవీందర్*
మాట్లాడుతూ అతి చిన్న వయసులో ఎర్రజెండా పట్టుకొని దొరల ఘడిలపై ఎర్రజెండా ఎగిరేసిన కామ్రేడ్ నర్సన్న విప్లవోద్యమంలో పనిచేస్తూ రహస్య జీవితం గడిపాడు అదేవిధంగా ప్రజల కోసం నిరంతరం రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలలో రాష్ట్రాలలో కార్యక్రమాలకు పాల్గొని ఆ కార్యక్రమాల సారాంశాన్ని ప్రజలకు వినిపిస్తూ నిజాంబాద్ జిల్లాలో పేద ప్రజల కోసం పేద ప్రజలను ఏకం చేసి ఇండ్లు లేని పేద కుటుంబాలకు ఏకం చేసి ఇండ్ల స్థలాలు కోసం నిరుపేద కుటుంబాల కోసం ఇండ్ల స్థలాలు ప్రభుత్వ భూమిని పేద ప్రజలకు పంచడం జరిగింది . ఈ సందర్భంగా తాను నిరంతరం విప్లవ జీవితం గడుపుతూ చనిపోయేంతవరకు పేద ప్రజల కోసం పనిచేయడం జరిగింది తన పోరాటాన్ని తన ఆశయాన్ని ఆచరణలో పెడుతూ తన నిర్మించిన కాలనీలో తన కోసం స్థూప నిర్మాణం చేపట్టాలని ఈరోజు నర్సన్న కాలనీలో కరపత్రం విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలు ఆర్థిక సహాయ సహకారాలు అందించి స్తూప నిర్మాణానికి తోడ్పడాలని విజ్ఞప్తి చేయడం జరిగింది . ఈ కార్యక్రమములో
*తెలంగాణ రైతు కూలీ సంఘం*
రాష్ట్ర కోశాధికారి *భామండ్ల రవీందర్* జిల్లా అధ్యక్ష కార్యదర్శులు *పల్ల మల్లేష్* *కత్తుల మారుతి* జిల్లా కమిటీ సభ్యులు *సత్యనారాయణ* *కొండ అనూషవ్వ* *శంకర్* *నరసింహులు* *రజియా* *బాల గౌడ్* నాయకులు *యాది మల్లు* *దుర్గయ్య* *గోపి బన్సీ* *కళావతి లక్ష్మి* *గంగవ్వ* తదితరులు
తెలంగాణ రైతు కూలి సంఘం నాయకులు పాల్గొనడం జరిగింది