Neti Satyam
Newspaper Banner
Date of Publish : 02 February 2026, 3:40 pm Editor : Admin

తెలంగాణ సాయుధ పోరాట యోధుల జాతీయ పురస్కారం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈరోజు రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుల అమరవీరుల స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో రావి నారాయణరెడ్డి జాతీయ పురస్కార ప్రధానోత్సవం సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా..

తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి గారికి “రావి నారాయణరెడ్డి జాతీయ పురస్కార” ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాను.

తెలంగాణ ప్రజల స్వేచ్ఛ కోసం, పేదల హక్కుల కోసం పోరాటం చేయడమే కాదు, సర్వం త్యాగం చేసిన మహనీయుడు రావి నారాయణ రెడ్డి గారు. న్యాయ వ్యవస్థ ద్వారా ప్రజల హక్కుల కోసం పని చేసిన, రాజ్యాంగం పట్ల సంపూర్ణ నిబద్ధత కలిగిన జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి గారికి ఈ అవార్డు ప్రదానం చేయడం అత్యంత సముచితం.

నేడు దేశంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం, ప్రజల ఓటు హక్కు రక్షణ కోసం, ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం రావి నారాయణ రెడ్డి స్ఫూర్తితో పని చేయాల్సిన అవసరం ఉంది.

ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు శ్రీ నారాయణ, శ్రీ చాడ వెంకట్ రెడ్డి, శ్రీ పల్లా వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ నెల్లికంటి సత్యం, ప్రొఫెసర్ శ్రీ కోదండరాం, ఎమ్మెల్యే శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.