Neti Satyam
Newspaper Banner
Date of Publish : 05 February 2026, 5:04 am Editor : Admin

నూతన సర్పంచులకు సన్మానం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నూతన సర్పంచులకు

సన్మానం.గన్నేరువరం,నేటిసత్యం,పీబ్రవరి 4:

గన్నేరువరం మండలంలోని ఈరోజు బ్రిడ్జి జేఏసీ చైర్మన్ సంపతి ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో నూతనంగా గెలుపొందిన రెండు గ్రామాల సర్పంచులకు కాసింపేట సర్పంచ్ కర్ణ చంద్రయ్య, అలాగే గోపాల్ పూర్ సర్పంచ్ ఆకుల కవిత కు మరియు రెండు గ్రామాల ఉప సర్పంచ్ లకు శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంపతి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యంగా గ్రామంలో ఉన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని అలాగే సిమెంట్ రోడ్ల నిర్మాణం మరియు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి కాసింపేట, గోపాలపూర్‌ను ఒక ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువజన సంఘాల సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.