Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogపోలీసుల. పల్లెనిద్ర.!

పోలీసుల. పల్లెనిద్ర.!

*పల్లెనిద్ర కార్యక్రమాలతో గ్రామాలలో సమస్యలు తలెత్తకుండా ప్రజల్ని చైతన్యం చేసిన పోలీసులు*

జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారి* ఆదేశాల మేరకు… జిల్లా వ్యాప్తంగా పలు సమస్యాత్మక గ్రామాలలో నిన్న రాత్రి పల్లెనిద్ర కార్యక్రమాలు

అనంతపురం జిల్లా వ్యాప్తంగా పోలీసులు పలు సమస్యాత్మక గ్రామాలలో నిన్న రాత్రి పల్లెనిద్ర కార్యక్రమాలు నిర్వహించారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా మరియు అసాంఘిక కార్యకలాపాల జోలికెళ్లకుండా ప్రజల్ని చైతన్యం చేశారు. ఆయా గ్రామాల ప్రజలతో ప్రత్యేకంగా సమావేశమై గ్రామంలోని సమస్యల గురించి అడిగి తెలుసుకుంటూనే ప్రస్తుత సమాజంలో జరుగుతున్న నేరాల గురించి వాటి బారిన పడకుండా ఏ విధంగా అప్రమత్తంగా వ్యవహరించాలి తదితర విషయాల గురించి అవగాహన చేశారు.

*ప్రజలకు పోలీసులు చేసిన సూచనలు, అవగాహనలు*

మట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగ్, ఇసుక అక్రమ రవాణ, గంజాయి అక్రమ రవాణా & విక్రయాలు, వినియోగం, అక్రమ మద్యం, నాటు సారాల జోలికెళ్లి జీవితాలు నాశనం చేసుకోకండి. వీటి కట్టడి కోసం చట్టం గట్టిగా పని చేస్తుందని ప్రజలకు సూచించారు

ప్రస్తుత పరిస్థితులలో సైబర్ నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయి వాటి బారిన పడకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా వ్యవహరించాలి అనే విషయాలను గురించి ప్రజలకు వివరించారు.

రోడ్డు ప్రమాదాలు బారిన పడకుండా ఉండడానికి పాటించవలసిన రోడ్డు భద్రత నియమాల గురించి… హెల్మెట్, సీట్ బెల్ట్ లు ధరించడం వలన కలిగే ఉపయోగాల గురించి అవగాహన కల్పించారు.

మహిళలు, చిన్నారులకు అండగా పోలీసు శాఖ ఉంటుంది. ఎవ్వరైనా వారిపట్ల అసభ్యకరంగా వ్యవహరించినా, వెంటపడి వేధించినా, నేరాలకు పాల్పడినా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శక్తి యాప్ వినియోగం వల్ల కలిగే ఉపయోగాలు గురించి వివరించారు.

బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం చట్ట విరుద్ధం. మద్యం మత్తులో వారు ఏదైనా నేరాలకు పాల్పడే అవకాశం ఉంటుంది కనుక శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని నేరాలను కట్టడి చేసే ఉద్దేశంతో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం

* అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాల గురించి సమాచారం తెలిస్తే స్థానిక పోలీస్ అధికారులకు (లేదా) డయల్ 100/112 నంబర్లకు కాల్ చేసి అందించాలని… సమాచారం పంపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments