అమ్మా.. బాగున్నారా.. మా పాలన చూస్తున్నారా..
*ఓటర్లతో మంత్రి దామోదర రాజనర్సింహ ముచ్చట్లు.*
షాద్ నగర్, నేటిసత్యం, ఫిబ్రవరి, 6 :: రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఎన్నికల ప్రచారము భాగములో ఓటర్లతో మాట ముచ్చట నిర్వహించారు, అమ్మా.. బాగున్నారా.. మా పాలన ఎలా ఉంది.. పథకాలు అందుతున్నాయా.. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది.. అంటూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఓటర్లను పలకరించారు. 14వ వార్డు అభ్యర్థి అందెమోహన్ తరపున ఇంటింటి ప్రచారానికి వచ్చిన ఆయన స్థానిక భవాని మాత ఆలయం వద్ద రచ్చబండ ఏర్పాటు చేసి మహిళలతో మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరికి ఆప్యాయంగా పలకరించారు, పలువీధుల్లో తిరిగి కాంగ్రెస్ పాలన ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. తమ అభ్యర్థి అందెమోహన్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు. ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి మున్సిపాలిటీని చేతికి అందించాలని ఆయన ఓటర్లను కోరారు…