Neti Satyam
Newspaper Banner
Date of Publish : 06 February 2026, 11:43 am Editor : Admin

12న కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె – కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం టి. రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు

నేటి సత్యం శేర్లింగంపల్లి ఫిబ్రవరి 6

12న జరిగి సమ్మెను విజయవంతం చేయాలని. టి రామకృష్ణ మాట్లాడుతూ..

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నట్లు కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ప్రకటించాయి. ఈ సమ్మెలో కోట్లాది మంది కార్మికులు, ఉద్యోగులు, రైతులు, వ్యవసాయ కూలీలు పాల్గొననున్నారు.

నాలుగు లేబర్ కోడ్ల అమలు ద్వారా కార్మిక హక్కులను కాలరాస్తూ, ఉద్యోగ భద్రతను దెబ్బతీస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేటీకరణ, కాంట్రాక్టు వ్యవస్థ విస్తరణ, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం వంటి చర్యలతో నిరుద్యోగం పెరిగి, కార్మికుల జీవన ప్రమాణాలు దిగజారుతున్నాయని సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

కనీస వేతనం నెలకు ₹26,000గా నిర్ణయించాలి, పెన్షన్ పునరుద్ధరించాలి, ధరల పెరుగుదలను నియంత్రించాలి, రైతులకు కనీస మద్దతు ధర చట్టబద్ధం చేయాలి, ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలని ప్రధాన డిమాండ్లుగా ప్రకటించారు.

ఈ సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని, కార్మిక వర్గం, రైతాంగం, ప్రజాసంఘాలు ఐక్యంగా పాల్గొని ప్రభుత్వ విధానాలకు గట్టి సందేశం ఇవ్వాలని పిలుపునిస్తునా టి రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు