(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నూతన సర్పంచ్ చొరవతో మురుగునీరు సమస్య పరిష్కారం.
గన్నేరువరం, నేటి సత్యం, ఫిబ్రవరి 7:
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో మురుగునీరు సమస్యను నూతన సర్పంచ్ రంగనవేణి లచ్చి నర్సు వెంటనే పరిష్కరించారు. గ్రామంలోని ప్రధాన రహదారిపై కొన్ని సంవత్సరాలుగా మురుగునీరు ప్రవహిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తుండగా, నూతన సర్పంచ్ వెంటనే చర్యలు తీసుకుని మురుగునీరు రోడ్డుపై వెళ్లకుండా జెసిబి సాయంతో పైపులు వేసి శాశ్వతంగా మురుగు నీరు రాకుండా చేసి సమస్యను పరిష్కరించారు.
దీంతో గ్రామంలోని ప్రజలు మురుగునీటి సమస్య నుండి బయటపడ్డారు. సర్పంచ్ కి గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ గ్రామపంచాయతీ కార్మికులు ప్రజలు పాల్గొన్నారు.