Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogశ్రీశైలం పాదయాత్రకు వెళ్తున్న భక్తులకు కీలక సూచనలు

శ్రీశైలం పాదయాత్రకు వెళ్తున్న భక్తులకు కీలక సూచనలు

**శ్రీశైలం పాదయాత్రకు వెళ్తున్న భక్తులకు కీలక సూచనలు**

మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం పాదయాత్ర వెళ్ళే భక్తులకు ఫిబ్రవరి నెల 8 నుండి 15 వరకు అడవి మార్గం గుండా వెళ్లడానికి అటవీశాఖ వారు అనుమతులను మంజూరు చేయడమైనది.

భక్తులు ఈ విషయాన్ని గమనించి అందుకు తగ్గట్టుగా మీ ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకుని మీ పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకునీ ఆ శివయ్య ఆశీస్సులను అందుకోగలరని ఆశిస్తున్నాను.

ఈ పాదయాత్ర సందర్భంగా మీరు గుర్తుంచుకోవాల్సిన కీలక విషయాలు:

1. ప్లాస్టిక్ వస్తువులు అడవి మార్గంలో నిషేధం

2. సిగరెట్ పాన్ గుట్కా తంబాకు మరియు మద్యపానం లాంటివి పూర్తిగా నిషేధం

3. ఈ పాదయాత్ర ఆత్మకూరు దగ్గర ఉన్నటువంటి వెంకటాపురం నుండి మొదలవుతుంది. కావున భక్తులు తమ వాహనాలను ఆత్మకూరు దగ్గర ఉన్నటువంటి చెక్పోస్ట్ వరకు తీసుకువెళ్లి అక్కడనుండి కాలినడకన బయలుదేర వలసి ఉంటుంది

4. అటవీ మార్గంలో నడుస్తున్నప్పుడు మీకు అవసరమైన మందులు ( అనగా ఒళ్ళునొప్పులకు , కీళ్ల నొప్పులకు , తలనొప్పి , కాళ్ళు బెనకటం) మీతో పాటుగా తీసుకు వెళ్ళగలరు.

5. దారినడకలో ఫోన్ సిగ్నల్ ఉండదు. అందుకు తగ్గట్టుగా మీరు సిద్ధంగా ఉండగలరు. డిజిటల్ పేమెంట్స్ పనిచేయవు. కావున తగినంత చిల్లర ( 20, 50, 100 నోట్లు ) మీతో తీసుకువెళ్ళండి.

6. కాలినడక దారిలో మధ్యలో అన్నప్రసాద వితరణ జరుగుతుంది ( పూర్తి వివరాలకు కింద జతచేయబడిన ఫోటో చూడగలరు ). దప్పిక ఎక్కువగా ఉంటుంది .. కావున తగినన్ని నీళ్లు మీ వెంట తీసుకెళ్లండి.మధ్యలో నీళ్లు అమ్ముతుంటారు. మీ బాటిల్స్ లో వాటిని నింపుకోవచ్చు.

7.వైద్య సౌకర్యాలు నియమించబడిన ప్రదేశాలలో అందుబాటులో ఉంటాయి. ఇవి పూర్తిగా ఉచితం.

8. మీరు వేర్వేరు భూభాగాల ( కొండలు , లోయలు ) గుండా నడుస్తారు. ఇందుకు మీ శరీరం మీకు పూర్తిగా మద్దతు ఇవ్వాలి. అలా నడవలేని వారు దయచేసి ప్రయత్నించకండి.

9. టాయిలెట్లు నిర్దేశించబడిన ప్రదేశాలలో అందుబాటులో ఉంటాయి. గమనించగలరు.

10. విశ్రాంతి కోసం పెద్ద చెరువు దగ్గర ఆగాల్సి ఉంటుంది. అక్కడ పట్టలు బాడుగకు దొరుకుతాయి. వాటిమీద నిద్రించాల్సి ఉంటుంది.

11. మీరు శ్రీశైలం వరకు నడిచి వెళ్ళాటానికి , మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి.

12. ఈ ప్రయాణంలో మీవెంట ఆ శివయ్య ఉంటాడని మరచిపోకండి. ఆయన ఆశీస్సులు మనపైన ఎప్పుడూ ఉంటాయి.

ఓం నమః శివాయ 🚩

హర హర మహదేవ్ 🚩🚩

తప్పకుండా షేర్ చేయండి అందరికీ తెలిసేలా చేయండి!!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments