Neti Satyam
Newspaper Banner
Date of Publish : 09 February 2026, 12:45 pm Editor : Admin

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

పెద్దపెల్లి, నేటి సత్యం, ఫిబ్రవరి 8 :

పెద్దపెల్లి జిల్లా 8 వ ఇంక్లైన్ కాలనీ శాంతినికేతన్ విద్యాసంస్థ లో 2000-2001 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు 25 సంవత్సరాల తర్వాత కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపెళ్లి సమీపంలో ఓ రిసార్టులో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం నిర్వహించారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ప్రస్తుతం వారి ఉన్న స్థితిగతులను పరిచయం చేసుకున్నారు. పాఠశాల కరస్పాండెంట్ రాళ్ల బండి శంకర్ ప్రసాద్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు తమకు గురువులను ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.