(adsbygoogle = window.adsbygoogle || []).push({});
చిలకలూరిపేట లో ఏసీబీ దాడులు…
24 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఏ ఈ సత్యనారాయణ…
చిలకలూరిపేట :- అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు జరిపిన దాడులు ప్రభుత్వ కార్యాలయాల్లో తీవ్ర కలకలం రేపాయి…
పంచాయతీ రాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ ఏ ఈ గా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ చార్యులు, ఒక కాంట్రాక్టర్ నుండి రూ. 24,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు…
గతంలో పూర్తి చేసిన కొన్ని కాంట్రాక్టు పనులకు సంబంధించిన బిల్లులను మంజూరు చేయాలని సదరు కాంట్రాక్టర్ ఏఈని కోరారు. అయితే, ఆ బిల్లులు పాస్ చేయడానికి ఏఈ సత్యనారాయణ చార్యులు లంచం డిమాండ్ చేశారు…
దీనితో విసిగిపోయిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. సోమవారం పంచాయతీ రాజ్ శాఖ కార్యాలయంలో బాధితుడి నుంచి నగదు తీసుకుంటుండగా, ముందస్తు ప్రణాళికతో దాడులు చేసిన ఏసీబీ బృందం ఆయనను అదుపులోకి తీసుకుంది…