(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఆత్మీయ సమ్మేళనం తోపాటు ఆకలి తీర్చారు
–మీల్స్ ఆన్ వీల్స్ ద్వారా 150 మందికి భోజనం అందజేత
—శాంతినికేతన్ విద్యార్థుల ఔదార్యం
పెద్దపెల్లి, నేటి సత్యం, పీబ్రవరి 10:
పెద్దపెల్లి జిల్లా 8వ ఇంక్లైన్ కాలనీ శాంతినికేతన్ విద్యాసంస్థ లో 2000- 2001 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు 25 సంవత్సరాల తర్వాత కలుసుకొని ఘనంగా వేడుకలు జరుపుకోవడంతో పాటు వారంతా కలిసి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320జి డిస్టిక్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమం ద్వారా మంగళవారం ఉదయం ఉచిత అల్పాహారం మధ్యాహ్న భోజనం 150 మందికి అందించి ఔదార్యాన్ని చాటుకున్నారు. విద్యార్థులు చేపట్టిన సేవా కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ లయన్ రాళ్ల బండి శంకర్ ప్రసాద్ రెడ్డి శశికళ దంపతులు పాల్గొని విద్యార్థి సుమన్ తో పాటు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు సమాజ సేవకు, సేవా కార్యక్రమాలకు ఆర్థిక సహాయం చేయడం అభినందనీయమని అన్నారు. త్వరలోనే విద్యార్థులు అందించిన ఆర్థిక సహాయంతో నిరుపేద మహిళలకు కుట్టు మిషన్ సైతం అందజేయనున్నట్లు తెలిపారు. గత 954 రోజులుగా మీల్స్ ఆన్ వీల్స్ ద్వారా ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320 జి ద్వారా నిరంతరాయంగా దాతల సహకారంతో సాగుతుందని తెలిపారు. ఆర్థిక సహాయం అందించిన విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.