ఏ శివలింగాన్ని పూజిస్తే ఏ ఫలితం వస్తుంది?
వివిధములైనటువంటి లింగారాధనలు విశేషంగా చెప్తున్నది శాస్త్రం. అందులో శిలాలింగం మొదలుకొని రత్న లింగములు ఇత్యాదులు శాస్త్రమునందు కనపడుతున్నాయి. ముక్తామయ లింగంతో అంటే ముత్యంతో చేసిన లింగంతో ఆరాధన చేస్తే రోగ నాశనము. ఒక ముత్యాన్ని తీసుకుని అదే శివలింగంగా భావించి ఆవాహన చేసి పూజ చేస్తే రోగ నాశనము. ఒక్కొక్క ప్రయోజనం కోసం ఒక్కొక్క విధమైన ఆరాధన చేయవచ్చు. వజ్రంతో చేసిన లింగాన్ని ఆరాధిస్తే ఆయుర్వృద్ధి జరుగుతుందని, వైడూర్యంతో శివలింగారాధన చేస్తే శత్రునాశనము పద్మరాగం శివలింగంగా భావించి...