రిజిస్ట్రార్ ఆఫీస్ అటెండర్ కే ఇన్ని కోట్లు ఆస్తి ఉంటే..??*
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు రేణిగుంట సబ్ రిజిస్టర్ ఆఫీస్ అటెండర్ తిరుమలేష్ ను ఏసీబీ అరెస్ట్ చేసింది.
తిరుపతి, నెల్లూరు జిల్లాలోని ఆరు ప్రాంతాల్లో ఏకకాలంగా అధికారులు సోదాలు చేశారు.
11 ఆస్తి పత్రాలు, 1.47 కేజీలు బంగారం, 8.77 కేజీలు వెండి, 15 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
మరో రెండు బ్యాంకుల లాకర్లు తేరవాల్సి ఉందని అధికారులు తెలిపారు.
అవినీతి ఆరోపణల నేపథ్యంలో 2025 అక్టోబర్ లో అతడు సస్పెండ్ అయినట్లు తెలుస్తుంది..
మర్రిపాడు మండలం,డీసీపల్లి లోని తిరుమలేష్ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇళ్లలో గురువారం రెండు బృందాలుగా ఏర్పడి ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే..