Neti Satyam
Newspaper Banner
Date of Publish : 11 February 2026, 2:59 pm Editor : Admin

నేడు జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి టి.రామకృష్ణ రాష్ట్ర సమితి సభ్యులు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సర్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి. టి. రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు

దేశవ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగులు, రైతులు, కూలీలు, విద్యార్థులు, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 12న నిర్వహించబడుతున్న సర్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నను.

ప్రస్తుతం పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, కార్మిక చట్టాల బలహీనపరిచే విధానాలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, రైతుల సమస్యలు, పింఛన్ హక్కుల హరింపు వంటి అనేక ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వివిధ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు పిలుపునిచ్చిన ఈ సర్వత్రిక సమ్మెకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలపాలి.

ప్రజల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, ఉపాధి హామీ, కనీస వేతనాల పెంపు, కార్మికుల భద్రత వంటి ప్రధాన డిమాండ్ల సాధన కోసం ఈ సమ్మె ఒక ముఖ్యమైన పోరాటంగా నిలుస్తుంది.

అందువల్ల ఫిబ్రవరి 12న జరిగే సర్వత్రిక సమ్మెలో పాల్గొని, విజయవంతం చేయాలని, ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

టి రామకృష్ణ సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు