Neti Satyam
Newspaper Banner
Date of Publish : 12 February 2026, 4:33 pm Editor : Admin

శ్రీశైలం మల్లన్నకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పట్టు వస్త్రాల సమర్పణ




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

రాష్ట్ర ప్రభుత్వంచే పట్టువస్త్రాల సమర్పణ

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ రోజు (12.02.2026) సాయంకాలం *రాష్ట్ర ప్రభుత్వం తరుపున రాష్ట్ర దేవదాయశాఖ గౌరవ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డిగారు, స్థానిక గౌరవ శాసనసభ్యులు శ్రీ బుడ్డా రాజశేఖరరెడ్డితో కలిసి శ్రీస్వామిఅమ్మ వార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు.*

ఈ సమర్పణ కార్యక్రమంలో *దేవదాయ కమిషనరు, శ్రీ కె. రామచంద్ర మోహన్, జిల్లా కలెక్టర్‌ శ్రీమతి రాజకుమారి గణియా, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ శ్రీ ఎస్.ఎస్. చంద్రశేఖర ఆజాద్ , ధర్మకర్తల అధ్యక్షులు శ్రీ పోతుగుంట రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారి శ్రీ యం.శ్రీనివాసరావు వారు పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు* పాల్గొన్నారు.

కార్యక్రమములో ముందుగా ఆలయ రాజగోపురం వద్ద వస్త్ర సమర్పణ సంకల్పం, వస్త్రాలకు పూజాదికాలు మొదలైన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.

అనంతరం మంత్రివర్యులు మరియు స్థానిక శాసనసభ్యులవారు మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేసి ప్రదక్షిణ పూర్వకంగా స్వామిఅమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు.

కాగా ఎంతో చారిత్రక ప్రసిద్ధి పొందిన శ్రీశైలక్షేత్రంలో ఎందరో చక్రవర్తులు, రాజులు, రాజకుటుంబీకులు మొదలైన వారు ఆయా ఉత్సవ సందర్భాలలో శ్రీ స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించేవారని ప్రతీతి.

ఈ సంప్రదాయాన్ని అనుసరించే రాష్ట్ర ప్రభుత్వం ఏటా మహాశివరాత్రి మరియు దసరా మహోత్సవాలలోనూ శ్రీ స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలను అనవాయితీగా సమర్పిస్తోంది.