ఇది తెలుగు నాట ఉన్న పైత్యం
తమిళనాడులో తమిళం లోనే వాడిస్తారు జడ్జ్ మెంట్ ఇస్తారు,
కేరళలో మలయాళం లోనే వాదిస్తారు జడ్జ్ మెంట్ ఇస్తారు,
కర్ణాటక లో కన్నడ లో వాదిస్తారు జడ్జ్ మెంట్ ఇస్తారు.
కానీ తెలుగునాట తెలంగాణ లో తెలుగులో మాట్లాడటం తప్పట.
నిన్న తెలంగాణ కోర్టు ఇచ్చిన తీర్పు విచిత్రం గా ఉంది… తెలుగు లో వాదిస్తే మేము వినం.. ఇంగ్లీష్ లోనే వాదించాలట…అంటే ఇంగ్లీష్ వస్తేనే కోర్టు మెట్లు ఎక్కాలా..?మరి నేరం చేసిన వ్యక్తి జడ్జ్ ముందు చెప్పేవి న్యాయమూర్తికి ఎలా చెప్పాలి ఇంగ్లీష్ నేర్చుకొని వచ్చి చెప్పాలా..? పార్లమెంట్ లో స్పీకర్ ముందు ఏ రాష్ట్రా0 MP లు వాళ్ళ భాష లో మాట్లాడటం లేదా..?సుప్రీం కోర్టు పరిధి వేరు కావొచ్చు కానీ ఎవరి రాష్ట్రం లో వాళ్ళు వాళ్ళ రాష్ట్రం లో కోర్టు లో స్వంత భాష వాడక పోవడం ఏమిటి..?, బ్రిటిష్ చట్టాలు బూజు పట్టిపోతే మీరు దులపరా..?ఒక నేరం మోపబడిన వ్యక్తి తన ఆవేదన చెప్పుకొనే పరిస్థితి లేకపోతే ఇద్దరు న్యాయవాదులు వాదించుకొని న్యాయమూర్తి తీర్పు ఇచ్చేస్తే సరిపోతుందా..? అసలు న్యాయవాదులు ఎలా వాదించారు అనేది క్లైంట్ కు ఎలా తెలుస్తుంది.ఒక న్యాయవాది జడ్జ్ ను మై లార్డ్ అనడం విచిత్రం కాదా..?న్యాయమూర్తి దేముడు ఎలా…?ఒకవేళ న్యాయమూర్తి దేముడు అవుతే క్రింద కోర్టు తీర్పు పై కోర్టు కొట్టివేస్తుంటే దేముడికి అవమానం కాదా…?ఒక పౌరుడికి చట్టం లో ఉన్న అన్ని సెక్షన్స్ లు తెలియాలని..తెలిసే అవకాశం లేనప్పుడు..తెలియక చేసిన తప్పు కు న్యాయమూర్తి వెతికి వెతికి సెక్షన్ కింద శిక్ష ఎలా వేస్తారు.. చట్టాల లో ఏ తప్పుకు ఏ శిక్ష… ఏ పని చేస్తే తప్పు అని మొదట ప్రజలకు తెలియాలి కదా…ఆతరువాత ఆపని చేస్తే అతిక్రమణ క్రింద శిక్ష ఉండాలి కదా..?బ్రిటీష్ చట్టం అమాయకపు అక్షరం ముక్క రాని ప్రజలకు ఎలా రుద్దుతారు..? క్రింద కోర్టు న్యాయమూర్తి తీర్పు ఛాలెంజ్ చేస్తూ సుప్రీం కోర్టు వెళ్ళడం అంటే క్రింద కోర్టు దేవుడిని అవమానించడమే…ఒక న్యాయవాదికి డబ్బు ఇవ్వడం..కోర్టు ఫీజు కట్టడం కూడా దేముడి దగ్గర న్యాయం కొనుక్కోవడమే అవుతుంది కదా..? ఇదీ దేవుడిని దేముడి నీ నమ్మే వాళ్ళ ఆత్మ విశ్వాసాలను దెబ్బతియ్యడమే..!