Neti Satyam
Newspaper Banner
Date of Publish : 15 February 2026, 11:53 am Editor : Admin

మర్యాద పూర్వకంగా. కలిసిన కర్నూల్ ఎస్పీ




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

కర్నూలు జిల్లా…

జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన … కర్నూలు ఎస్పీ.

ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 15 తేదిలలో అనంతపురం జిల్లా, గుత్తి మండలంలోని చెర్లోపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సేవాఘడ్ లో వెలసిన బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ 287 వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి.

ఢిల్లీలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు గా కొనసాగుతున్న శ్రీ జాటోతు హుస్సేన్ నాయక్ గారు అనంతపురం కు వెళుతూ ఈ రోజు కర్నూలు ప్రభుత్వ అతిథి గృహం కు చేరుకున్నారు.

ఈ సంధర్బంగా శనివారం ఉదయం కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు ఆయనకు పూల మొక్కను అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు.

జిల్లాలో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు, దర్యాప్తు వేగవంతం, బాధితులకు చట్టపరమైన సహాయం, అవగాహన కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాల పై చర్చించారు.

ఈ కార్యక్రమంలో కర్నూలు ఎస్పీ గారితో పాటు కర్నూలు డిఎస్పీ శ్రీ జె. బాబు ప్రసాద్, కర్నూలు పట్టణ సిఐలు నాగరాజారావు, శేషయ్య పాల్గొన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు.