Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogశ్రీశైలంలో పాగా అలంకరణ ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

శ్రీశైలంలో పాగా అలంకరణ ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

శ్రీశైలంలో పాగాలంకరణ ఏర్పాట్లను పరిశీలించిన కర్నూలు రేంజ్ డిఐజి మరియు జిల్లా ఎస్పీ..

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి….

కర్నూలు రేంజ్ డీఐజీ శ్రీ కోయ ప్రవీణ్ IPS గారు…..

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో శివరాత్రి రోజు నిర్వహించనున్న పాగాలంకరణ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కర్నూలు రేంజ్ డీఐజీ శ్రీ కోయ ప్రవీణ్ IPS గారు మరియు జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS గారు ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా డీఐజీ గారు మాట్లాడుతూ పాగా అలంకరణ దర్శనం కోసం ఆహ్లాదకర వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చెయ్యాలని,భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి.

క్యూ లైన్లను, భక్తుల రాకపోకల మార్గాలలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చెయ్యాలి.

ఒక పద్దతి ప్రకారం గుడి పరిసరాలలో భక్తులు ఉంటూ స్వామి అమ్మవార్ల దర్శనంతో పాటు పాగా అలంకరణ విక్షించేలా చర్యలు తీసుకోవాలి.

దర్శనార్థం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సక్రమమైన మార్గదర్శకాలు, తాగునీటి సౌకర్యం, వైద్య సహాయం వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలి.

ప్రత్యేకంగా పాగాలంకరణ సమయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లు, భద్రతా మరియు బందోబస్తు తదితర అంశాలపై సమన్వయంతో విధులు నిర్వహించాలి.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు సిబ్బందిని నియమించి, నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.

అదేవిధంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ అవసరమైన చోట అధికారులకు సూచనలు ఇవ్వాలి.

భక్తులు సంయమనం పాటిస్తూ అధికారుల సూచనలతో పాగా అలంకరణను వీక్షించాలని అనుసరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో కర్నూలు రేంజ్ డీఐజీ గారితో పాటు జిల్లా ఎస్పీ గారు, సంబంధిత పోలీసు అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments