శ్రీశైలంలో పాగలంకరణ
పాగాలంకరణ లింగోద్భవకాల మహారుద్రాభిషేకం ప్రారంభమైన వెంటనే పాగాలంకరణ ప్రారంభించబడుతుంది. బ్రహ్మోత్సవాలలో జరిగే ఈ పాగాలంకరణకు ఎంతో ప్రత్యేకత ఉంది. మన వివాహాలలో పెండ్లికుమారునికి తలపాగ చుట్టడం ఒక సంప్రదాయం. ఈ ఆచారమే శ్రీశైల ఆలయంలో పాగాలంకరణ పేరతో ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ పాగా స్వామివారి గర్భాలయ విమాన శిఖరం నుండి ముఖమండపంపై ఉండే నందులను అనుసంధానం చేస్తూ అలంకరించబడుతుంది. పాగాలను సమర్పించే భక్తులు నియమంతో భక్తిని మేళవించి సంవత్సరంలో 365 మూరల పొడవుతో ఈ పాగాను నేస్తారు....